సిద్దిపేట జిల్లాలో బాలికల కిడ్నాప్‌కు యత్నం  | An attempt to kidnap the girls in Siddipet district | Sakshi
Sakshi News home page

సిద్దిపేట జిల్లాలో బాలికల కిడ్నాప్‌కు యత్నం 

Jul 3 2019 2:22 AM | Updated on Jul 3 2019 2:22 AM

An attempt to kidnap the girls in Siddipet district - Sakshi

నిందితులు సందీప్‌నిహార్, జగదీశ్‌

ములుగు (గజ్వేల్‌): సిద్దిపేట జిల్లా ములుగు మండలం మాసాన్‌పల్లిలో ఇద్దరి బాలికల కిడ్నాప్‌ యత్నం కలకలం రేపింది. మంగళవారం పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న బాలికలకు చాకెట్లు ఆశ చూపి ఎత్తుకుని పారిపోతున్న కిడ్నాపర్లను గ్రామస్తులు గమనించి దేహశుద్ధి చేసి బాలికలను కాపాడారు.  

మాసాన్‌పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మంగళవారం మధ్యాహ్న భోజన సమయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సందీప్‌నిహార్, జగదీశ్‌ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న ఒకటవ, రెండవ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలకు చాక్లెట్లు ఆశ చూపి దగ్గరకు పిలు చుకుని ఎత్తుకుని పారిపోతున్నారు. ఈ క్రమంలో మిగతా పిల్లల అరుపులను గమనించిన గ్రామస్తులు వారిని అడ్డుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం గ్రామస్తులు కిడ్నాపర్లను స్థానిక పోలీసులకు అప్పగించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement