మెదక్ జిల్లా ఝరాసంగంలోని సిండికేట్ బ్యాంకు ఏటిఎంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు..
ఝరాసంగంరూరల్ : మెదక్ జిల్లా ఝరాసంగంలోని సిండికేట్ బ్యాంకు ఏటిఎంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు జహీరాబాద్ రూరల్ సిఐ రఘు తెలిపారు. సోమవారం ఝరాసంగం ఠాణాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బర్దీపూర్ గ్రామంలో ఈ నేల 6 వ తేదిన సాయంత్రం గ్రామానికి చెందిన బండమిది మహేష్ ఎవరు లేని సమయంలో సిండికేట్ బ్యాంకు ఏటిఎంలోకి చోరబడి అక్కడి సీసీ కెమెరాను ధ్వంసం చేసి ఏటీఎం నుంచి నగదు దొంగలించేందుకు విఫలయత్నం చేశాడు. చోరీ యత్నం గమనించిన సిండికేట్ బ్రాంచి అసిస్టెంట్ మేనేజర్ పాండరినాథ్ 7వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. సీసీ కెమెరాలో ఉన్న చిత్రాల ఆధారంగా బండమిది మహెష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు తెలిపారు.