ఆయుధాలతో బెదిరించి కౌన్సిలర్ కిడ్నాప్ | armoor trs councillor kidnaped | Sakshi
Sakshi News home page

ఆయుధాలతో బెదిరించి కౌన్సిలర్ కిడ్నాప్

Jun 29 2014 11:49 PM | Updated on Sep 2 2017 9:34 AM

ఆయుధాలతో బెదిరించి కౌన్సిలర్ కిడ్నాప్

ఆయుధాలతో బెదిరించి కౌన్సిలర్ కిడ్నాప్

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ 20వ వార్డు టీఆర్‌ఎస్ కౌన్సిలర్ సుంకరి శంకర్ శనివారం అర్ధరాత్రి కిడ్నాప్‌కు గురయ్యారు.

ఆర్మూర్: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ 20వ వార్డు టీఆర్‌ఎస్ కౌన్సిలర్ సుంకరి శంకర్  శనివారం అర్ధరాత్రి కిడ్నాప్‌కు గురయ్యారు. కాంగ్రెస్ నాయకులు మాజీ మావోయిస్టులతో కలిసి కిడ్నాప్ చేసినట్లు టీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థి అయిన బొగడమీది శ్రీదేవి భర్త అయిన కాంగ్రెస్ నాయకుడు ఏబీ శ్రీనివాస్ (చిన్న), కాంగ్రెస్ నాయులు మహేందర్, ఫత్తేపూర్ అశోక్ రెడ్డి, మాజీ మావోయిస్టు పచ్చలనడ్కుడ అన్వేష్, బట్టు శంకర్,  సుంకెట చిన్న గంగారాం, అమర్ భూషణ్‌లు ఆయుధాలతో బెదిరించి తన భర్తను కిడ్నాప్ చేసినట్లు శంకర్ భార్య సుంకరి స్వప్న ఆర్మూర్ డీఎస్పీ ఆకుల రాంరెడ్డికి ఆదివారం ఫిర్యాదు చేసారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఈ విషయాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి చేరవేయడంతో ఆయన ఈ విషయమై సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement