breaking news
armoor municipality
-
శవయాత్రలో శబ్ద కాలుష్యం
సాక్షి, నిజామాబాద్: శవయాత్రలో భాగంగా కోర్టు ముందు డప్పులు వాయిస్తూ బాణాసంచా పేల్చి శబ్ద కాలుష్యానికి పాల్పడిన సంఘటన ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. ఈ సంఘటన ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు..ఆర్మూర్ పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీకి చెందిన ప్యాట్ల లక్ష్మన్(45) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందారు. శుక్రవారం కుటుంబ సభ్యులు మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి కాలనీ నుంచి అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని కోర్టు మీదుగా శవయాత్రతో బయలుదేరారు. ఈ క్రమంలో కోర్టు ఎదుట గల అంబేద్కర్ చౌరస్తా వద్ద బాణసంచా పేల్చారు. కోర్టు ఎదుట నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం సృష్టించి తమ విధులకు ఆటంకం కల్పించిన వారిని తన ముందు హాజరు పరచాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు ఘటనకు బాధ్యులైన ఐదుగురిపై కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి చర్యను నిరసిస్తూ పట్టణంలోని ఎల్ఐసీ భవనం ఎదుట 63వ నెంబరు జాతీయ రహదారిపై మృతదేహంతో నాలుగు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా కూర్చుని రాస్తారోకో చేయడంతో రహదారికి ఇరువైపులా ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రయాణికులు బస్సులు వదిలి కాలినడకన బస్టాండ్‌కు చేరుకున్నారు. ఆర్మూర్ సీఐ రాఘవేందర్‌తో పాటు పోలీసులు ఆందోళనకారులకు ఎంత సర్దిచెప్పినా వినలేదు. తమ బంధువులపై పెట్టిన కేసులు ఎత్తివేసే వరకు రాస్తారోకోను విరమించేది లేదని బీష్మించుకు కూర్చున్నారు. అంత్యక్రియలు సైతం చేసేది లేదంటూ తేల్చిచెప్పారు. చివరికి ఆర్మూర్ ఏసీపీ అందె రాములు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు రాస్తారోకో చేస్తున్న స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు సర్ది చెప్పారు. వారిపై ఎలాంటి కేసులు ఉండవని పోలీసులతో పాటు న్యాయవాదులు లోక భూపతిరెడ్డి, ఎంకే నరేందర్, గంట సదానందం హామీ ఇవ్వడంతో రాస్తోరోకో విరమించారు. -
కళ్లున్నా చూడలేని ఆర్మూర్ మున్సిపాలిటీ..
బలహీనమైన పాలకవర్గం.. ఆదాయానికి గండి.. మున్సిపల్ మడిగెలకు నామమాత్రపు అద్దె అద్దె పెంపు గడువు ముగిసి ఏడాది.. ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపాలిటీలో పాలకవర్గం బలహీనతను ఆసరాగా తీసుకొని మున్సిపల్ కాంప్లెక్స్‌లో మడిగెలను వ్యాపారుస్తులు నామమాత్రపు అద్దె చెల్లిస్తూ మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇటీవల పాలకవర్గంతో పాటు మున్సిపల్ అధికారులను మేనేజ్ చేయడానికి సదరు మడిగెల్లో ఉంటున్న 9మంది వ్యాపారస్తులు ఒక్కొక్కరు రూ.35వేల చొప్పున రూ.3,15,000 వసూలు చేసినట్లు తెలిసింది. సుమారు 50 ఏళ్ల క్రితం ఆర్మూర్ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో గ్రామ పంచాయతీ స్థలంలో పంత్ రోడ్డులో 9 దుకాణాలను నిర్మించారు. ఈ దుకాణలపై అద్దె రూపంలో వచ్చే ఆదాయాన్ని గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్‌లో జమ చేస్తూ వచ్చారు. అప్పటినుంచే పాలకులు, అధికారులు దుకాణాదారుల నుంచి నామమాత్రపు అద్దెనే వసూలు చేస్తూ వస్తున్నారు. 1998లో గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీకి చెందిన దుకాణాల్లో కొనసాగుతున్న వ్యాపారస్తుల పేర్లు మారుస్తూ దుకాణాలు కేటాయించారు. నిబంధనల ప్రకారం ప్రతీ మూడేళ్లకొకసారి పాలకవర్గం సమావేశమై మడిగెల అద్దెపై 33.5 శాతం పెంచుతూ రావాలి. 2006లో ఆర్మూర్ పంచాయతీ మున్సిపాలిటీగా మారింది. కాని పాలకులు, అధికారులు మాత్రం వ్యాపారస్తులకు అనుకూలంగా వ్యవహరించడమే కాకుండా కేవలం రూ.3,000 అద్దెతో కొనసాగుతున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువగా.. పంత్రోడ్డులో ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది. అయితే మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఉన్న మడిగెలకు నెలకు, రూ.3,000 అద్దె వసూలు చేస్తే.. రోడ్డు అవతలివైపు ఉన్న ప్రైవేట్ కాంప్లెక్స్‌లలో ఉన్న మడిగెలకు ఒక్కోదానికి నెలకు రూ.10,000 నుంచి రూ.12,000 వసూలు చేస్తున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో ఏం జరిగింది.. జీవో నెంబర్ 56 ఆధారంగా పాలకవర్గం అద్దె పెంపులో మున్సిపాలిటీకి ఆదాయం పెంచడంలో సానుకూలంగా వ్యవహరించని సమయంలో మున్సిపల్ కమిషనర్ సీడీఎంకు లేఖ ద్వారా తెలియజేసి వారి ఆదేశాల మేరకు అద్దెను పెంచడానికి ఆస్కారం ఉంటుంది. కాని ఇందులో ఏ ఒక్కటీ జరగలేదు. విషయమేమిటంటే ఈ కాంప్లెక్స్‌లో 9మంది దుకాణాదారులు పొట్టకూటి కోసం వ్యాపారాలు చేస్తున్నారు అనుకుంటే పొరపాటే... అంతా కోటీశ్వరులే ఉన్నారు. అదే మార్కెట్లో వారికి షాపింగ్‌మాల్స్ కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారి పేరిట కూడా అద్దె కొనసాగుతోంది. గడువు ముగిసి.. ఈ దుకాణాల అద్దె పెంపు గడువు 2015 అక్టోబర్ 31 నాటికే ముగిసి పోయింది. కాని మున్సిపల్ అధికారులు, పాలకవర్గం తమకేమీ పట్టనట్లుగా ఉండిపోయారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారిన విషయం ఆర్మూర్ పట్టణంలో బహిరంగ రహస్యమే. అవినీతికి తావు లేకుండా అద్దె పెంచుతాం. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 9 దుకాణాల అద్దె పెంపు గడువు ముగిసి ఏడాది గడుస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన అధికారులు ఎందుకు పట్టించుకోలేదో తెలియదు. ఈ వ్యవహారంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా మున్సిపాలిటీకి ఆదాయం పెంచడమే లక్ష్యంగా అద్దె పెంపు ఒప్పందాన్ని పూర్తి చేస్తాము. నిబంధనలకు విరుద్దంగా కేటాయింపులు జరిగితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాము. - శైలజ, మున్సిపల్ కమిషనర్, ఆర్మూర్ -
ఆయుధాలతో బెదిరించి కౌన్సిలర్ కిడ్నాప్
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ 20వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ సుంకరి శంకర్ శనివారం అర్ధరాత్రి కిడ్నాప్‌కు గురయ్యారు. కాంగ్రెస్ నాయకులు మాజీ మావోయిస్టులతో కలిసి కిడ్నాప్ చేసినట్లు టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థి అయిన బొగడమీది శ్రీదేవి భర్త అయిన కాంగ్రెస్ నాయకుడు ఏబీ శ్రీనివాస్ (చిన్న), కాంగ్రెస్ నాయులు మహేందర్, ఫత్తేపూర్ అశోక్ రెడ్డి, మాజీ మావోయిస్టు పచ్చలనడ్కుడ అన్వేష్, బట్టు శంకర్, సుంకెట చిన్న గంగారాం, అమర్ భూషణ్‌లు ఆయుధాలతో బెదిరించి తన భర్తను కిడ్నాప్ చేసినట్లు శంకర్ భార్య సుంకరి స్వప్న ఆర్మూర్ డీఎస్పీ ఆకుల రాంరెడ్డికి ఆదివారం ఫిర్యాదు చేసారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఈ విషయాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి చేరవేయడంతో ఆయన ఈ విషయమై సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.