మురిగిన గుడ్లు.. ముద్ద దిగదు.. | Sakshi
Sakshi News home page

మురిగిన గుడ్లు.. ముద్ద దిగదు..

Published Fri, Feb 27 2015 12:27 AM

Anganwadi centers that supply the eggs are even worse.

‘అంగన్‌వాడీ’లకు ఛీగుడ్ల సరఫరా
ఇనుగుర్తిలో వెలుగు చూసిన వైనం
తినలేకపోతున్న పిల్లలు, గర్భిణులు, బాలింతలు

 
కేసముద్రం : అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లు అధ్వానంగా ఉన్నారుు. ఉడకబెట్టిన తర్వాత సొన కారడం, దుర్వాసన రావడంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు వాటివైపు చూడడంలేదు. మండలంలోని ఇనుగుర్తి అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం మురిగిపోరుున గుడ్లు దర్శనమిచ్చారుు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం-2లో 12 మంది గర్భిణులు, 20 మంది 6 నెలల నుంచి మూడేళ్లలోపు, 19 మంది 3 ఏళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు ఉన్నారు. అరుుతే కొద్ది రోజులుగా ఈ కేంద్రంలో ఉడకబెడుతున్న గుడ్లు పగిలిపోతుండటం, ఉడికిన గుడ్లన్నీ దుర్వాసన రావడంతో తినలేకపోతున్నారు. నిత్యం కేంద్రంలో భోజనం తినేందుకు వచ్చే గర్భిణులు, పిల్లలు, బాలింతలు గుడ్లు తినడానికి జంకుతున్నారు. కాగా, కేంద్రంలోని గుడ్లు తిన్న ఒకరు అస్వస్థతకు గురై తేరుకున్నట్లు సమాచారం. గుడ్ల పరిస్థితి అన్ని కేంద్రాల్లో ఇలాగే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

నెల రోజుల ముందే సరఫరా..

పది రోజులకోసారి కోడిగుడ్లను కాంట్రాక్టర్ సరఫరా చేయాల్సి ఉంది. కానీ నెలరోజుల ముందే ఒక్కసారిగా గుడ్లను దిగుమతి చేసి వెళ్లిపోతున్నాడు. ఎక్కువ రోజులు కావడం వల్లే గుడ్లు ఇలా చెడిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్క కేంద్రంలో 52 మంది ఉండగా.. ఒకేసారి 1,228 గుడ్లు దిగుమతి చేయడం వల్ల ఇబ్బంది కలుగుతుందని, అరుుతే చెప్పినా వినకుండా దిగుమతి చే స్తున్నాడని అంగన్‌వాడీ కార్యకర్త కళావతి తెలిపారు. రవా ణా ఖర్చుల మిగులుబాటు కోసం కాంట్రాక్టర్ ఇలా చేస్తున్నారని, అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ స్థానిక ప్రజాప్రతినిధులు మండిపడుతున్నా రు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అంగన్‌వాడీ కేం ద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరుతున్నారు.
 

Advertisement
Advertisement