మండల సాధన ఉద్యమం ఉధృతం | Akkannapeta to HUSNABAD Movement | Sakshi
Sakshi News home page

మండల సాధన ఉద్యమం ఉధృతం

Jun 5 2016 2:42 AM | Updated on Sep 4 2017 1:40 AM

మండల సాధన ఉద్యమం ఉధృతం

మండల సాధన ఉద్యమం ఉధృతం

అక్కన్నపేట మండల సాధన ఉద్యమం ఉధృతమైంది. అక్కన్నపేట కేంద్రంగా కొత్త మండలాన్ని...

అక్కన్నపేట టు హుస్నాబాద్
రెండువేల మందితో పాదయూత్ర
బోనాలు, బతుకమ్మలతో     భారీ ప్రదర్శన
 

హుస్నాబాద్/హుస్నాబాద్ రూరల్ : అక్కన్నపేట మండల సాధన ఉద్యమం ఉధృతమైంది. అక్కన్నపేట కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేయూలని కోరుతూ గ్రామస్తులు శనివారం అక్కన్నపేట నుంచి హుస్నాబాద్ వరకు 11 కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించారు. దాదాపు రెండువేల మంది డప్పుచప్పుళ్లు, బోనాలు, బతుకమ్మ ఆటలు ఆడుకుంటూ హుస్నాబాద్ చేరుకున్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారీ మానవహారం నిర్వహించారు. పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి మండల ఆకాంక్షను చాటారు. ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ వాణికి వినతిపత్రం సమర్పించారు. అక్కన్నపేటను మండలకేంద్రంగా ప్రకటించే దాకా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.

జెడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ... అక్కన్నపేటను మండలంగా ప్రకటించేలా ఎమ్మెల్యే సతీష్‌కుమార్ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళుతానని అన్నారు. హుస్నాబాద్ తర్వాత పెద్ద గ్రామమైన అక్కన్నపేటను మండలం చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు కావల్సిన ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందన్నారు. గ్రామం మీదుగానే సూర్యాపేట ఫోర్ లేన్ వెళ్తుందన్నారు.

గ్రామం పరిధిలో 14 గిరిజన తండాలు ఉన్నాయని, మూడు జిల్లాలకు సరిహద్దుగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్య మంగ, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, హుస్నాబాద్ జిల్లా సాధన కమిటీ కన్వీనర్ అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, మండల సాధన కమిటీ అధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ జాగిరి వసంత సత్యనారాయణ, ఎంపీటీసీ భూమయ్య, ఉపసర్పంచ్ సారయ్య, మాజీ సర్పంచ్ కర్ణకంటి శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ కందుల రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు ముత్యాల సంజీవరెడ్డి, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు మేడవేని లచ్చవ్వ, సూరవ్వ, సింగిల్‌విండో డెరైక్టర్ పీర్ల లింగమూర్తి, సాధన కమిటీ సభ్యులు టీ.ఎల్లయ్య,పెసరి శ్రీకాంత్, తిరుపతినాయక్, రవీందర్, చెవుల సదయ్య, బాలమల్లు, బాలరాజు, యాదయ్య, అక్బర్‌పాషా, వేల్పుల సంపత్, చిరంజీవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement