కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

AITUC Bus Tour Reached Thallada  - Sakshi

బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలి

ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సింగు నరసింహారావు

తల్లాడ చేరుకున్న ఏఐటీయూసీ బస్సు యాత్ర

తల్లాడ ఖమ్మం : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ, వారి పాలిట శాపంగా మారిందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సింగు నరసింహారావు అన్నారు. శుక్రవారం ఏఐటీయూ సీ బస్సు ప్రచార యాత్ర ఏన్కూరు మీదుగా తల్లాడ చేరుకుంది. ఈ సందర్భంగా బీజీ.క్లెమెంట్‌ అధ్యక్షతన రింగ్‌సెంటర్‌లో జరిగిన సభలో ఆయ న మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రేడ్‌ యూనియన్‌ చట్టాన్ని మారుస్తూ భవిషత్తులో పర్మినెంట్‌ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత లేకుండా పైర్‌ అనే విధానాన్ని ప్రవేశపెడుతూ శాశ్వత ఉద్యో గులు లేకుండా చర్యలకు పూనుకుంటున్నాయని ఆరోపించారు.

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాం డ్‌ చేశారు. బంగారు తెలంగాణ సాధి స్తామని కేసీఆర్‌ ప్రగల్భాలు పలికి వాగ్ధానాలను అమలు చేయటంలో పూర్తిగా విఫలమయ్యా రని విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించక పోతే ఈ ప్రభుత్వాలకు పతనం తప్పదని ఆయన హె చ్చరించారు. ఈ సందర్భంగా తల్లాడలో కార్మికులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జని రత్నాకర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.కరుణకుమారి, సహాయ కార్యదర్శి బాలరాజు, ఏఐటీయూసీ డివిజన్‌ నాయుకులు నిమ్మటూ రి రామక్రిష్ణ, నల్లమోతు నరసింహరావు, టీ.వెంకటేశ్వర్‌రావు, తాళ్లూరి లక్ష్మీ, సుభద్ర, జయమ్మ, జే.వెంకటలక్ష్మీ, ఎం.పద్మ,సీత, కొల్లి నాగభూషణం, ఇనుపనూరి క్రిష్ణ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top