కదలిక

కదలిక


మామునూరులో విమానాశ్రయం!

ఐదున్నర దశాబ్దాల కల నెరవేరే వేళ

తాజా పరిస్థితిపై నివేదిక కోరిన కేంద్రం

1,200 ఎకరాల భూమి అవసరం..

నిధులిస్తే మిగతా భూసేకరణకు ఏర్పాట్లు

గాలిమోటార్‌పై జిల్లావాసుల్లో ఆశలు


 

హన్మకొండ అర్బన్ :జిల్లాలో విమానాశ్రయంపై తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లావాసుల్లో ఆశలు చిగురిస్తున్నారుు. గాలిమోటార్‌లో తిరిగే అవకాశం వస్తుందని భావిస్తున్నారు. మామునూరులో ఏరుుర్‌పోర్టు ఏర్పాటైతే ప్రయోజనకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం జిల్లా యంత్రాంగం, నాయకులు తమవంతు ప్రయత్నాలు చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటు విషయంలో కేంద్రం సుముఖత వ్యక్తం చేయడం.. గతంలో రాష్ట్రం నుంచి పంపిన ప్రతిపాదనలపై తాజాగా నివేదిక కోరడంతో మామునూరు విమానాశ్రయం విషయంలో కదలికవచ్చింది.

 

తొలి ప్రధాని వచ్చినప్పటి కల..



జిల్లాలోని మామునూరులో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని డిమాండ్ ఇప్పటిది కాదు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తొలిసారిగా వాయుదూత్ విమానంలో మామునూరులో దిగారు. అప్పటి నుంచి జిల్లా యంత్రాంగం భవిష్యత్ అవసరాల దృష్ట్యా మామునూరులో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతూనే ఉంది. అప్పటి నుంచి మొదలైన భూసేకరణ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇంతకాలం ఆశించిన స్థాయిలో మామునూరువిమానాశ్రయంలో ఏర్పాటుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు.

 

1960కి ముందే భూసేకరణ



మామునూరులో విమానాశ్రయం  ఏర్పాటునకు 1960 కన్నా ముందే భూసేకరణ చేసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నారుు. ఆ సమయంలో ఏనుమాముల గ్రామం పరిధిలో 320 ఎకరాలు, నక్కలపల్లి గ్రామం పరిధిలో 96 ఎకరాలు, తిమ్మాపురం పరిధిలో 290 ఎకరాలు మొత్తం 706 ఎకరాలు సేకరించారు. విమానాశ్రయానికి రన్‌వే, టర్మినల్, ఇతర అవసరాల కోసం కనీసం 1,200 ఎకరాలకు తగ్గకుం డా భూమి ఉండాలని చెప్పడంతో అదనంగా 450 ఎకరాలు సమీపంలో ఉన్న గ్రామాల రైతుల నుంచి భూసేకరణ చేయాలని యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో గాడిపల్లి పరిధిలో 243 ఎకరాలు, ఇతర సమీప గ్రామాల్లో మరో 184 ఎకరాలు మొత్తం 427 ఎకరాలు సేకరించేందుకు భూమి అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. ఈ మొత్తం భూసేకరణకు ప్రాథమిక అంచనాగా 2011 లెక్కల ప్రకారం రూ.28 కోట్లు అవసరమవుతాయని.. వాటి ని విడుదల చేస్తే రైతులకు 80 శాతం చెల్లింపులు చేసి భూమి స్వాధీనం చేసుకోవచ్చని అప్పట్లోనే అధికారులు ప్రభుత్వానికి లేఖ పంపించారు.



2008లో కేంద్ర బృందం పరిశీలన



2008 సంవత్సరంలో ఒకసారి కేంద్రం నుంచి ఏయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా  ప్రతినిధుల బృందం జిల్లాకు వచ్చింది. కలెక్టర్‌తో భేటీ తర్వాత మామునూరు విమానాశ్రయం ఏర్పాటు స్థలం పరి శీలించింది. అయితే అధికారులు చెప్పినట్లు అక్కడ 706 ఎకరాలు స్థలం లేదని అందులో సుమారు 11 ఎకరాల వరకు ఆక్రమణలకు గురయిందని గుర్తించింది. దీనిపై స్థలం కాపాడాలని కోరుతూ కలెక్టర్‌కు లేఖ రాశారు. ఇదిలా ఉండగా ఇందులోనే 142.11 ఎకరాల స్థలాన్ని జిల్లా యంత్రాంగం పశు సంవర్ధక శాఖకు కేటాయించింది.

 

రూ.కోటి కేటాయింపు




జిల్లా యంత్రాంగం నుంచి 2012 ప్రారంభంలో భూ సేకరణ కోసం రూ.28 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం రూ.కోటి విడుదల చేసింది. అయితే ఇందుకు సంబంధించి పరిపాలనా పరమైన అనుమతులు వెంటనే రాలేదు. దీంతో అధికారులు భూసేకరణ ప్రక్రియ ప్రారంభానికి ప్రకటన జారీ చేసేందుకు  అనుమతివ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ తరువాత పనుల్లో పురోగతి లేదు. అయితే 2012లో భూసేకరణ చట్టంలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేయడం వల్ల అందుకు అనుగుణంగా మార్గదర్శకాలు రాలేదని అధికారులు ముందుకు కదల్లేదు.

 

ప్రాంతీయ విమానాశ్రయం?




కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటు విషయం తెరపైకి తేవడంతో మా మునూరు విషయం మరోసారి ముందుకు వచ్చిం ది. అయితే మిగతా జిల్లాలతో పోల్చి చూస్తే భూసేకరణ, ఇతర అంశాల విషయంలో మామునూరుకు అన్నీ అనుకూల అంశాలు ఉండటంతో స్వరాష్టలో అయినా విమానాశ్రయం చూడాలన్న జిల్లావాసుల కలనెవేరుంతుందనే ఆశలు చిగురిస్తున్నాయి.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top