మాత, శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం

The aim is to reduce maternal and child mortality - Sakshi

పీవో డీటీటీ మనోహర్‌

ఆదిలాబాద్‌టౌన్‌: మాత, శిశు మరణాల శాతం తగ్గించడమే లక్ష్యమని జిల్లా వైద్యారోగ్య శాఖ పీవో డీటీటీ డాక్టర్‌ మనోహర్‌ అన్నారు. గురువారం ఆదిలాబాద్‌ పట్టణంలోని రిమ్స్‌ వైద్య కళాశాలలో ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని వైద్యాధికారులు, పారామెడికల్‌ సిబ్బందికి మాత, శిశు మరణాల శాతం తగ్గించడంపై దక్షత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మనోహర్‌ మాట్లాడుతూ లక్ష మంది బాలింతల్లో 92 మంది మృత్యువాత పడుతున్నారని, వెయ్యి మంది చిన్నారులగాను 28 మంది నవజాత శిశువులు చనిపోతున్నారని తెలిపారు.

మాత, శిశు మరణాలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత వైద్యాధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. మూడు రోజులు జరిగే శిక్షణ కార్యక్రమంలో ప్రసవానికి ముందు, తర్వా త స్టాఫ్‌నర్సులు, వైద్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జఫ్రిగో ప్రోగాం అధికారి డాక్టర్‌ ప్రేరణ, ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధి సత్యేంద్రనాథ్, కాగజ్‌నగర్‌ సీఎస్‌ విద్యావతి, వైద్యాధికారులు, స్టాఫ్‌నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top