‘నాన్నగారి ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి’ | aakash puri happy about movie hit | Sakshi
Sakshi News home page

‘నాన్నగారి ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి’

Jun 10 2015 8:19 AM | Updated on Mar 22 2019 1:53 PM

‘నాన్నగారి ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి’ - Sakshi

‘నాన్నగారి ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి’

నాన్నగారి ప్రోత్సాహంతోనే సినిమాల్లో నటిస్తున్నాను.

పాల్వంచ రూరల్: 'నాన్నగారి ప్రోత్సాహంతోనే సినిమాల్లో నటిస్తున్నాను. నా పేరు వెనుక నాన్న గారు పూరి జగన్నాథ్ పేరు ఉంది. ఆంధ్రాపోరి చిత్రం ఇటు తెలంగాణ, ఆటు ఆంధ్రప్రదేశ్‌లో రెండు రాష్ట్రాలలో విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది. మూడు సంవత్సరాల పాటు  విదేశాలలో నటనపై శిక్షిణ పొందిన అనంతరం మళ్లి సినిమాలలో నటిస్తా. నేను తొలిసారి హీరోగా నటించిన చిత్రం షూటింగ్ జరుపుకున్నందుకు ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటాను' అని 'ఆంధ్రాపోరి' హీరో ఆకాష్ పూరి అన్నారు.
 
ఆంధ్రాపోరి చిత్రం యూనిట్ మంగళవారం పాల్వంచలో సందడి చేసింది. ఎల్‌వి. ప్రసాద్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్ర హీరో ఆకాశ్‌పూరితోపాటు నిర్మాత మహేష్, సంగీత దర్శకులు ప్రవీణ్ వనమాల, పాటల రచయిత జోశ్య భట్ల బృందం మంగళవారం నవభారత్ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని, పెద్దమ్మతల్లి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆంధ్రాపోరి చిత్రం ప్రదర్శిస్తున్న  శాంతి థియేటర్‌కు చేరుకున్నారు. ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూశారు.  థియేటర్  స్క్రీన్ వద్దకు వెళ్లిన ఆకాశ్‌పూరి ప్రేక్షకులతో మాట్లాడారు. వారి కోరిక మేరకు డ్యాన్స్ చేశారు. ప్రేక్షకలనుద్దేశించి మాట్లాడుతూ  ప్రేక్షకులకు, పాల్వంచ ప్రజలకు, చిత్రంలో నటించిన స్థానిక కళకారులకు  రుణపడి ఉంటానని అన్నారు. చిత్ర నిర్మాత  మహేష్ మాట్లాడుతూ ఆంధ్రాపోరి చిత్రం తెలంగాణ, ఆంధ్రాలో విజయవంతమైందన్నారు. ఆంధ్రాపోరికి సీక్వెల్ తీయనున్నట్లు తెలిపారు. చిత్ర యూనిట్‌తో స్థానిక కళాకారులు సైదులు, శ్రీనివాస్,శిరిష, సునిత, రత్నబారుు, ఎండి యాకూబ్, నాగేందర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement