స్టేషన్‌ఘన్‌పూర్‌లో రైల్వే గేటు దాటుతుండగా రైలు ఢీకొనడంతో మంగళవారం ఇద్దరు మృతి చెందారు.
వరంగల్(స్టేషన్‌ఘన్‌పూర్): స్టేషన్‌ఘన్‌పూర్‌లో రైల్వే గేటు దాటుతుండగా రైలు ఢీకొనడంతో మంగళవారం ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో అక్షయ అనే ఐదేళ్ల చిన్నారితో పాటు చిన్నారి నానమ్మ ఓలం స్వరాజ్యం(60) అక్కడిక్కడే మృతి చెందారు.
దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. రైల్వే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృత దేహాలను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.