9999.. రూ.11.50 లక్షలు

9999 Sold For Highest Amount In Auction Of Fancy Numbers In Hyderabad - Sakshi

రూ.11.50 లక్షలు 

సాక్షి, హైదరాబాద్‌: లక్కీ నంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. సోమవారం ఖైరతాబాద్‌లో నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ‘టీఎస్‌ 09 ఎఫ్‌జే 9999’నంబర్‌ కోసం హెటిరో డ్రగ్స్‌ సంస్థ ఏకంగా వేలంలో రూ.11,50,050 చెల్లించి సొంతం చేసుకుంది. ఈ సంస్థ తమ రూ.2.96 కోట్ల ఖరీదైన రేంజ్‌ రోవర్‌ 4.4 డీజిల్‌ ఎల్‌డబ్ల్యూబీ కోసం ఈ నంబర్‌ను దక్కించుకుంది. అలాగే ‘టీఎస్‌ 09 ఎఫ్‌కే 0006’నంబర్‌ కోసం ఎం.విజయ్‌కృష్ణ అనే వాహనదారుడు రూ.1.53 లక్షలు చెల్లించారు. తమ హ్యూందాయ్‌ కారు కోసం ఈ నంబర్‌ను వేలంలో గెలుచుకున్నారు. ‘టీఎస్‌ 09 ఎఫ్‌కే 0009’నంబర్‌ కోసం ఇంపార్టా ట్రైనింగ్‌ అకాడమీ రూ.1.26 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. సోమవారం ఒక్క రోజు నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో రూ.23,46,321 లభించినట్లు జేటీసీ పాండురంగ్‌నాయక్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top