ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
వేములపల్లి (నల్లగొండ జిల్లా) : ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం కామేపల్లి గ్రామ సమీపంలో జరిగింది.
వివరాల ప్రకారం.. కామేపల్లి గ్రామ సమీపంలోని పాలేరువాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వాగు దగ్గరకు వెళ్లి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అంతేకాకుండా ట్రాక్టర్ల డ్రైవర్లను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.