ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం 557 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వినోద్‌కుమార్ శనివారం తెలిపారు.
సాక్షి,హైదరాబాద్: ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం 557 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వినోద్‌కుమార్ శనివారం తెలిపారు. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్లతో పాటు, వివిధ ప్రాంతాల్లోని పలు ఏటీబీ కేంద్రాల నుంచి 19, 20లలో ఇవి బయలుదేరుతాయి. వివరాలకు 040-24614406, 040-23434268 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.