సిర్పూర్‌ చెరువులో 40 అడుగుల బుద్ధ విగ్రహం | 40 feet Buddha statue in Sirpur Pond | Sakshi
Sakshi News home page

సిర్పూర్‌ చెరువులో 40 అడుగుల బుద్ధ విగ్రహం

Feb 24 2017 2:41 AM | Updated on Sep 5 2017 4:26 AM

సిర్పూర్‌ చెరువులో 40 అడుగుల బుద్ధ విగ్రహం

సిర్పూర్‌ చెరువులో 40 అడుగుల బుద్ధ విగ్రహం

సిర్పూర్‌ పట్టణం శివారులోని నాగమ్మ చెరువులో వచ్చే బుద్ధపూర్ణిమ నాటికి 40 అడుగుల ఎత్తులో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు

సిర్పూర్‌ పట్టణం శివారులోని నాగమ్మ చెరువులో వచ్చే బుద్ధపూర్ణిమ నాటికి 40 అడుగుల ఎత్తులో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో ప్రకటించారు. ఈ నిర్ణయంపై సదస్సుకు హాజరైన విదేశీ బౌద్ధ ఆరాధకులు హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రానికి వచ్చే బౌద్ధ పర్యాటకులు ఈ చెరువును తప్పనిసరిగా చూసేలా అభివృద్ధి చేస్తామని కోనప్ప వెల్లడించారు.

20 అడుగుల ఎత్తుతో బుద్ధుడి విగ్రహం, దిగువన పది అడుగులతో  కమలం, దాని దిగువన బౌద్ధ చిహ్నాలతో కూడిన 10 అడుగుల వేదిక ఉంటుందని తెలిపారు. విగ్రహం రూపు దిద్దుకుంటోందని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రోత్సాహంతో ఈ బృహత్తర ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని కోనప్ప వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement