ఎస్పీఎం కార్మికుల పిల్లల ఫీజు చెల్లించిన ఎమ్మెల్యే | SPM workers' children Fees paid MLA | Sakshi
Sakshi News home page

ఎస్పీఎం కార్మికుల పిల్లల ఫీజు చెల్లించిన ఎమ్మెల్యే

Mar 14 2015 3:24 AM | Updated on Sep 2 2017 10:47 PM

సిర్పూర్ పేపర్ మిల్లు మూతపడిపోవడంతో పలు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న కార్మికుల పిల్లల ఫీజులు తామే చెల్లిస్తామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇచ్చిన మాట నెరవేర్చారు.

కాగజ్‌నగర్ టౌన్ : సిర్పూర్ పేపర్  మిల్లు మూతపడిపోవడంతో పలు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న కార్మికుల పిల్లల ఫీజులు తామే చెల్లిస్తామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇచ్చిన మాట నెరవేర్చారు. పలువురు దాతలు, మంత్రి జోగు రామన్నతోపాటు తన సొంత డబ్బులతో పిల్లల వార్షిక ఫీజులు చెల్లించారు. గత నెల 28న ఉప ముఖ్యమంత్రి శ్రీహరి చేతుల మీదుగా ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులకు రూ.14లక్షలు ఫీజు అందజేశారు. తాజాగా శుక్రవారం ద్వారకానగర్‌లోని సరస్వతీ శిశుమందిర్‌లో వివిధ పాఠశాలల కరస్పాండెంట్లకు రూ.7 లక్షలు ఫీజు చెల్లించా రు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ యూజ మాన్యం మొండి వైఖరి వల్ల మిల్లులు ఉత్పత్తి నిలిచిపోయిందని, దీంతో కార్మికులు జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పిల్లల చదువు ఆగకుండా తాము బాధ్యత తీసుకుని ఫీజులు చెల్లించామని వెల్లడించా రు. ఫీజులు చెల్లించడానికి తన జీతంతోపాటు దాతలు వెంకటరాంరెడ్డి(హైదరాబాద్), పవన్‌రెడ్డి, రవీందర్‌రావు, నర్సింగోజు సత్యనారాయణ(కాగజ్‌నగర్) సహకరించారని తెలిపారు.

ఫీజుల కోసం ఇప్పటికే రూ.21లక్షలు చెల్లించామని, త్వరలో మిగితా రూ.7లక్షలు ఇతర పాఠశాలల నిర్వాహకులకు అందజేస్తామని హామీనిచ్చారు.  మున్సిపల్ చైర్‌పర్సన్ సీపీ విద్యావతి, పట్టణ సీఐ జలగం నారాయణరావు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ దామోదర్‌రావు, ఎంఈవో భిక్షపతి, కౌన్సిలర్లు నియాజుద్దీన్ బాబా, బొద్దున విద్యావతి, నాయకులు జాకీర్ షరీఫ్, దినేష్ అసోపా, సీపీ రాజ్‌కుమార్, పెద్దపల్లి కిషన్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement