లక్సెట్టిపేటలో కారు బీభత్సం | 11 injured in a car accident incident | Sakshi
Sakshi News home page

లక్సెట్టిపేటలో కారు బీభత్సం

Aug 6 2015 6:13 PM | Updated on Aug 14 2018 3:22 PM

ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం కేంద్రంలో ఒక కారు బీభత్సం సృష్టించింది.

లక్సెట్టిపేట(ఆదిలాబాద్ జిల్లా): ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం కేంద్రంలో ఒక కారు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వచ్చిన ఆటోను ఢీ కొని అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. గురువారం గండెపల్లి మండలం నుంచి లక్సెట్టిపేట మండలానికి వెళ్తున్న ఆటోను కారు ఢీ కొట్టడంతో ఆటోలో ఉన్న 11 మంది గాయపడ్డారు. అయితే, డ్రైవర్ కారును అపకుండా వెళ్లిపోయాడు. అనంతరం రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి ఎదురుగా వస్తున్న బస్సును సైతం ఢీ కొట్టింది.

బస్సును ఢీ కొనడంతో డ్రైవర్ కారును అక్కడే వదిలి పారిపోయాడు. కాగా, గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు గండెపల్లి మండలం మేజర్‌పేట గ్రామానికి చెందినదిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement