బంపర్ ఆఫర్లతో విక్రయానికి వస్తున్న రెడ్మి 4 | Xiaomi Redmi 4 to Go on Sale in India on Tuesday: Launch Offers Detailed | Sakshi
Sakshi News home page

బంపర్ ఆఫర్లతో విక్రయానికి వస్తున్న రెడ్మి 4

May 22 2017 5:21 PM | Updated on Sep 5 2017 11:44 AM

బంపర్ ఆఫర్లతో విక్రయానికి వస్తున్న రెడ్మి 4

బంపర్ ఆఫర్లతో విక్రయానికి వస్తున్న రెడ్మి 4

గతవారం షియోమి లాంచ్ చేసిన రెడ్ మి 4 స్మార్ట్ ఫోన్ రేపే(మంగళవారం) అమ్మకానికి వస్తోంది.

షియోమి స్మార్ట్ ఫోన్లంటేనే మార్కెట్లో తెగ క్రేజ్. ఆన్ లైన్ అమ్మకానికి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే ఈ ఫోన్లకు భలే గిరాకి వస్తుంది. గతవారం షియోమి లాంచ్ చేసిన రెడ్ మి 4 స్మార్ట్ ఫోన్ రేపే(మంగళవారం) అమ్మకానికి వస్తోంది. అమెజాన్ ఇండియా, మి.కామ్ లలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ను విక్రయానికి ఉంచుతోంది కంపెనీ. విక్రయానికి వస్తున్న ఈ ఫోన్ తో పాటు బంపర్ ఆఫర్లను కూడా షియోమి తీసుకొస్తోంది. అమెజాన్ ఇండియాలో రెడ్ మి4 కొనుగోలు చేస్తే, వొడాఫోన్ నెట్ వర్క్ పై 45జీబీ ఉచిత డేటాను ఐదు నెలల పాటు అందించనుంది. అయితే వొడాఫోన్ 1జీబీ లేదా 4జీ డేటా ప్యాక్ ను రెడ్ మి 4 కస్టమర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ 45జీబీ ఉచిత డేటా కస్టమర్లకు అందుబాటులోకి వస్తోంది. అదేవిధంగా యస్ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు కస్టమర్లకు 500 రూపాయల క్యాష్ బ్యాక్ ను ఆఫర్ చేయనుంది. 
 
అమెజాన్ ఇండియాలో రెడ్ మి 4 పై ఉన్న మరిన్ని ఆఫర్లివివే...
ఎంఐ కేసెస్ లేదా కవర్ల రేటు రూ.499 రూపాయల నుంచి రూ.349 రూపాయలకు దిగిరానుంది.
ఎంఐ హెడ్ ఫోన్లు కూడా 599 రూపాయల నుంచే దొరకనున్నాయి. 
గోల్ బిబో విమానం, హోటల్ బుకింగ్స్ లో 5000 రూపాయల వరకు తగ్గింపు
కిండ్ల్ యాప్ పై 200 రూపాయల క్రెడిట్
 
మూడు స్టోరేజ్ వేరియంట్లలో రెడ్ మి4 లాంచ్ అయింది.  2జీబీ ర్యామ్/ 16జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 6,999 రూపాయలు, 3జీబీ వేరియంట్/32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8,999 రూపాయలు, 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 10,999 రూపాయలు. అయితే 4జీబీ వేరియంట్ మంగళవారం విక్రయానికి రావడం లేదు. జూన్ చివరి నుంచే ఈ వేరియంట్ విక్రయానికి వస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement