ఎల్జీ జీ6 ఆ రోజుకొంటే 10వేల క్యాష్ బ్యాక్ | LG G6 Launched in India; here are special offers for you | Sakshi
Sakshi News home page

ఎల్జీ జీ6 ఆ రోజుకొంటే 10వేల క్యాష్ బ్యాక్

Apr 24 2017 3:53 PM | Updated on Sep 5 2017 9:35 AM

ఎల్జీ జీ6 ఆ రోజుకొంటే 10వేల క్యాష్ బ్యాక్

ఎల్జీ జీ6 ఆ రోజుకొంటే 10వేల క్యాష్ బ్యాక్

శాంసంగ్ గెలాక్సీ లేటెస్ట్ మొబైల్ ఎస్8కి గట్టి పోటీగా మరో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేసింది.

శాంసంగ్ గెలాక్సీ లేటెస్ట్ మొబైల్ ఎస్8కి గట్టి పోటీగా మరో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేసింది. ఎల్జీ జీ6 పేరుతో అదిరిపోయే ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ ఫోన్ లాంచింగ్ తో పాటు స్పెషల్ ఆఫర్లను కూడా మీకోసం కంపెనీ తీసుకొచ్చేసింది. ఎల్జీ జీ6 ఫోన్ ను ప్రీ బుక్ చేసుకునే వారికి 7000 రూపాయల డిస్కౌంట్ ను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే ఆ వినియోగదారులు హెచ్డీఎఫ్సీ లేదా ఎస్బీఐ క్రెడిట్/  డెబిట్ కార్డు హోల్డర్లు అయి ఉండాలని తెలిపింది. అంతేకాక ఏప్రిల్ 25న కొనుగోలు చేసే కస్టమర్లకు 10వేల రూపాయల క్యాష్‌ బ్యాక్ ను ఇవ్వనున్నట్టు తెలిపింది.
 
రిలయన్స్ జియో కూడా ఈ ఫోన్ పై బంపర్ ఆఫర్లనే తీసుకొచ్చింది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన కస్టమర్లకు 2018 మార్చి వరకు 100జీబీ అదనపు డేటాను ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. అంటే ప్రతి 309 రీఛార్జ్ పై 10జీబీ అదనపు డేటా అన్నమాట.రెండు వేరియంట్లలో లాంచ్ చేసిన ఈ ఫోన్ ఏప్రిల్ 25 నుంచి ప్రత్యేకంగా అమెజాన్ ఇండియా ప్లాట్ ఫామ్ పై  అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ధర 51,990 రూపాయలు. మిస్టిక్‌ వూట్‌, అస్ట్రో బ్లాక్‌, ఐస్‌ ప్లాటినం మూడు రంగుల్లో ఇది లభ్యం కానుంది. డాల్బీ విజన్‌ ఫీచర్‌ తో వస్తున్న  ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్‌ ఇదేనని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement