ఐఫోన్‌ 8 మెగా ఈవెంట్‌: ఆపిల్‌ ఆహ్వానం | iPhone 8, iPhone 7s and iPhone 7s Plus to launch on September 12, Apple confirms launch event | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ 8 మెగా ఈవెంట్‌: ఆపిల్‌ ఆహ్వానం

Sep 1 2017 9:00 AM | Updated on Aug 20 2018 3:07 PM

ఐఫోన్‌ 10వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించబోతున్న మెగా ఈవెంట్‌పై ఆపిల్‌ స్పందించింది.



సాక్షి, కాలిఫోర్నియా:
ఐఫోన్‌ 10వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించబోతున్న మెగా ఈవెంట్‌పై ఆపిల్‌ స్పందించింది. మార్కెట్‌లో ఎన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నా.. ఏం మాట్లాడకుండా నిశబ్దంగా ఉన్న ఆపిల్‌ సెప్టెంబర్‌ 12న జరుగబోతున్న ఈ మెగా ఈవెంట్‌ను గురువారం ధృవీకరించేసింది. ఈ లాంచ్‌ ఈవెంట్‌కు సంబంధించి, ఆహ్వానాలు కూడా పంపుతోంది. కాలిఫోర్నియా, కూపర్టినోలోని తమ కొత్త క్యాంపస్‌లో స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌లో ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్టు ఆపిల్‌ తన ఆహ్వాన పత్రికల్లో పేర్కొంది. సగం కొరికిన ఆపిల్‌ కలర్‌ఫుల్‌ లోగోతో పాటు మెసేజ్‌ను కంపెనీ అందిస్తోంది.
 
''మన ప్రదేశంలో కలుసుకుందాం.. స్టీవ్‌ జాబ్స్‌లో థియేటర్‌లో నిర్వహించబోతున్న తొలి ఈవెంట్‌కు అందరూ రావాలి'' అంటూ ఆహ్వానిస్తోంది. ఆహ్వాన పత్రిక కూడా చాలా సాధారణ రూపంలో ఉంది. ఈ లాంచ్‌ ఈవెంట్‌లోనే, ఐఫోన్‌ ప్రత్యేక వార్షికోత్సవ ఎడిషన్‌ ఐఫోన్‌ 8ను లాంచ్‌ చేయబోతున్నారని తెలుస్తోంది. ఐఫోన్‌ 8తో పాటు, ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 7 ప్లస్‌ అప్‌డేటెడ్‌ స్మార్ట్‌ఫోన్లు ఐఫోన్‌ 7ఎస్‌, ఐఫోన్‌ 7ఎస్‌ ప్లస్‌లు లాంచ్‌ చేస్తున్నారని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఆపిల్‌ కొత్త వాచ్‌ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. 

 
ఐఫోన్‌ 8 ఇలానే ఉండబోతుందట....
  • 5.8 అంగుళాల డిస్‌ప్లే
  • ఓలెడ్‌ స్క్రీన్‌తో ఇది మార్కెట్‌లోకి వస్తుంది. ఈ ఐఫోన్‌లో అతిపెద్ద మార్పు ఇదే.
  • హైఎండ్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్లకు ఉన్న మాదిరిగా అత్యంత పలుచనైన బెజెల్స్‌
  • 3 జీబీ ర్యామ్‌.. 64, 256, 512 జీబీ అంతర్గత మెమొరీ వెర్షన్లు
  • మెరుగైన కెమెరాలు, వెనుకవైపు డ్యూయల్‌ కెమెరా సెటప్‌
  • 3డీ ఫేస్‌ రికగ్నైజేషన్‌
  • గతకొన్నేళ్లుగా ఐఫోన్స్‌లో వస్తున్న హోమ్‌ బటన్‌ ఇందులో ఉండదు. శాంసంగ్‌ ఎస్‌8, గూగుల్‌ పిక్సల్‌ మొబైళ్ల తరహాలో వర్చువల్‌ హోమ్‌ బటన్‌ ఉంటుంది. 
  • ఆపిల్‌ వాచ్‌, శాంసంగ్‌ హైఎండ్‌ మొబైల్స్‌లో ఉండే వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సౌకర్యాన్ని ఇందులో అందిస్తున్నారు. 
  • ఐఓఎస్‌11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
  • ధర సుమారు 1000 డాలర్లు ఉంటుందని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement