ఐఫోన్ 8.. ఎంతోకాలం నుంచి ఆపిల్ ఊరిస్తున్న తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్.

ఐఫోన్ 8.. ఎంతోకాలం నుంచి ఆపిల్ ఊరిస్తున్న తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్‌పై లీకేజీలు వస్తున్న అన్నీ ఇన్నీ కావు. 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆపిల్ ఈ ఐఫోన్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌లలో మున్నుపెన్నడూ లేని సరికొత్త ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి వస్తుందని ఇప్పటికే టెక్ వర్గాలు సిగ్నల్స్ ఇచ్చేశాయి. తాజాగా మరో లీకేజీ ఈ ఫోన్‌పై మరింత ఆసక్తిని రేపుతోంది. అది ఐఫోన్ 8 స్క్రీన్ సైజు. భారీ డిస్‌ప్లేతో ఇది ఆపిల్ అభిమానులను అలరించబోతుందట. ప్రస్తుతమున్న ఐఫోన్ 7 స్మార్ట్‌ఫోన్ 4.7 అంగుళాల డిస్‌ప్లే, 5.8 అంగుళాల డిస్‌ప్లేలకు 1.1 అంగుళాల మేర పైకి జంప్ చేస్తుందని ఆపిల్ నుంచే ఈ లీకేజీ వచ్చేసింది. కంపెనీ సొంత సాఫ్ట్‌వేర్ కూడా ఈ ఊహాగానాలకు ఆమోదం తెలుపుతోంది.