దూసుకొస్తున్న ఎద్దులు.. యువకుల ఢీ.. ‘జల్లి’ షురూ

jallikattu started in tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై : సంక్రాంతి పర్వదినం ఇటు తెలుగు ప్రాంతానికి కోడి పందాలను తీసుకురాగా అటు తమిళ రాష్ట్రానికి జల్లికట్టు తీసుకొచ్చింది. తమిళనాడులోని మధురైలోగల అవనీయపురంలో జల్లికట్టు ప్రారంభమైంది. దాదాపు 200 ఎద్దులను రంగంలోకి దించారు. రంకెలేస్తూ పరుగులు తీస్తూ దూసుకొస్తున్న ఎద్దులకు ఎదురెళ్లి వాటిని లొంగదీసేందుకు యువకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జల్లికట్టు అంటే తమిళనాడు ప్రజలకు ప్రాణం అనే విషయం తెలిసిందే.

గత ఏడాది నుంచి ఈ క్రీడ నిర్వహణపై సుప్రీంకోర్టులో వివాదం నడుస్తుండగా ప్రత్యేక అనుమతులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడను నిర్వహించింది. తాజగా, ఎలాంటి నిషేధాజ్ఞలు లెక్కచేయకుండానే తమిళనాడులోని పలు గ్రామాల్లో జల్లికట్టును ప్రారంభించేశారు. అనధికారికంగా పలువురు నాయకులు వీటిని ప్రారంభిస్తున్నారు. ఇక, తెలుగు ప్రాంతాలైన చిత్తూరు, నెల్లూరు జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో కూడా జల్లికట్లును ప్రారంభించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top