వినాశకాలే విపరీతబుద్ధి తరహాలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమ నిర్ణయాలను ప్రకటిస్తున్నారని వీటన్నింటిని, ....
సీఎం సిద్ధరామయ్యపై యడ్యూరప్ప ఫైర్
శివమొగ్గ : వినాశకాలే విపరీతబుద్ధి తరహాలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమ నిర్ణయాలను ప్రకటిస్తున్నారని వీటన్నింటిని, రాష్ట్ర ప్రజలు వాటిని గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బీఎస్ యడ్యూరప్ప మండిపడ్డారు. గురువారం నగరంలోని ప్రైవేట్ బస్టాండు ఆవరణలో ఏర్పాటు చేసిన స్వచ్ఛభారత్ అభయాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సిద్ధరామయ్య ప్రభుత్వం అవసానదిశకు చేరుకుందని ఎప్పుడైనా ఈ ప్రభుత్వం పతనమవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మఠాలకు పాలనాధికారులను నియమించడం ఖండనీయమన్నారు.
ఇలాంటి చర్యలు వల్ల సిద్ధరామయ్య కు మఠాలపై ఎలాంటి వైఖరిని అవలంభిస్తున్నది తెలుస్తుందన్నారు. మఠాధిపతులతో పాటు ప్రజల నుంచి తీవ్రవ్యతిరేకత వ్యక్తమౌతుండటంతో ప్రభుత్వం వెనక్కిత గ్గిందన్నారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని కేపీఎస్‌సీ స్థానానికి నియమించడం మంచిదకాదని అభిప్రాయపడ్డారు. జమ్ముకాశ్మీరులో ఇతర పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. నరేంద్రమోడీ హవాతో జమ్ముకాశ్మీరులో బీజేపీ అత్యధిక స్థానాలు కైవశం చేసుకుందన్నారు. నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ అభయాన్ కార్యక్రమం అత్యంత ఉత్తమమైంద న్నారు. అభియాన్ కార్యక్రమం వల్ల తమ గ్రామం, చుట్టుపక్క పరిసరప్రాంతాలను పరిశుభ్రం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని సూచించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీసీఎం కేఎస్ ఈశ్వరప్ప, రాజ్యసభ సభ్యుడు అయనూరు మంజునాథ్ పాల్గొన్నారు.