స్వైన్‌ఫ్లూ నిర్ధారణలో ఆర్‌ఎన్‌ఏ దోహదం | workshop in srikakulam over swine flu in RNA virus | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూ నిర్ధారణలో ఆర్‌ఎన్‌ఏ దోహదం

Published Thu, Sep 29 2016 12:08 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

'కెపాసిటీ బిల్డింగ్‌ ఇన్‌ మాలిక్యులర్‌ బయాలజీ’ అనే అంశంపై 5 రోజుల వర్క్‌షాప్‌ జరుగుతుంది.

శ్రీకాకుళం : స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో భారత ప్రభుత్వ న్యూఢిల్లీ సౌజన్యంతో  'కెపాసిటీ బిల్డింగ్‌ ఇన్‌ మాలిక్యులర్‌ బయాలజీ’ అనే అంశంపై 5 రోజుల వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం మూడో రోజు జీవ అణువు అయిన ఆర్‌ఎన్‌ఏను ఆధునిక పద్ధతి ద్వారా విద్యార్థులకు ప్రయోగాలు చేశారు. ఆధునిక సమాజంలో ఆహార ఉత్పత్తులు, క్యాన్సర్‌ వంటి వ్యాధులు నయం చేయడంలో యాంటీసెన్స్‌ ఆర్‌ఎన్‌ఏ సాంకేతిక శాస్త్రం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కుళ్లని టమోటాలను ఉత్పత్తి చేయడంలో ఈ సాంకేతిక శాస్త్రం దోహదపడుతుందని తెలిపారు. 
 
ఆర్‌ఎన్‌ఏను వేరు చేయడం వల్ల మధుమేహాన్ని నయం చేసే ఇన్సులిన్‌ను తక్కువ ధరకే సరఫరా చేయడానికి సాధ్యపడిందని తెలిపారు. స్వైన్‌ఫ్లూ నిర్ధారణలోనూ ఆర్‌ఎన్‌ఏ వేరుచేయడం ఉపయోగపడుతుందని జీవసాంకేతిక శాస్త్ర విభాగాధిపతి ఎం.ప్రదీప్, అధ్యాపకుడు డి.లక్షు్మనాయుడు తెలిపారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల నుంచి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement