ప్రధాని దృష్టికి తీసుకెళ్తా.. | Will resolve sentenced fishermen issue with India, says Sri Lanka | Sakshi
Sakshi News home page

ప్రధాని దృష్టికి తీసుకెళ్తా..

Nov 6 2014 10:44 PM | Updated on Sep 2 2017 3:59 PM

ఇటీవల శ్రీలంక కోర్టు భారతీయ మత్స్యకారులకు విధించిన మరణ శిక్ష విషయమై ప్రధాని నరేంద్రమోదీని కలిసి సంప్రదించి, వారికి న్యాయం జరిగి విధంగా కృషి చేస్తానని కేంద్ర రోడ్డు రవాణా,

 న్యూఢిల్లీ: ఇటీవల శ్రీలంక కోర్టు భారతీయ మత్స్యకారులకు విధించిన మరణ శిక్ష విషయమై ప్రధాని నరేంద్రమోదీని కలిసి సంప్రదించి, వారికి న్యాయం జరిగి విధంగా కృషి చేస్తానని కేంద్ర రోడ్డు రవాణా, నౌకాయాన మంత్రిత్వ శాఖ మాత్యులు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులో మాట్లాడారు. మత్య్యకారులు తమ సంప్రదాయాలను తనకు వివరించారని, ఈ కేసును ప్రధాని, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకె ళ్తానని చెప్పారు. 2011లో ఈ ఐదుగురు మత్స్యకారులు తమిళనాడు నుంచి మాధకద్రవ్యాలను తరలిస్తుండగా పట్టుకొన్నామని శ్రీలంక నావికాదళం కేసు నమోదు చేసింది. ఈ మేరకు కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేసిందని చెప్పారు. వీరికి శ్రీలంక కోర్టు మరణ శిక్ష విధిస్తూ గతనెల తీర్పు ఇచ్చిందన్నారు. విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఈ విషయాన్ని వెల్లడించారని చెప్పారు. ఈ తీర్పు విషయాన్ని  కొలంబోలోని భారత హైకమిషన్ న్యాయవాది ద్వారా హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఐదుగురు మత్స్యకారులకు కిందికోర్టు విధించిన మరణ శిక్షను సమీక్షించాలని కోరిందని అన్నారు. అధికార, న్యాయపరంగా మత్స్యకారులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇటీవల శ్రీలంకలో భారత రాయబారి వైకే సిన్హా ఇటీవల జైలును సందర్శించి, మత్స్యకారుల విడుదల చేయించి, స్వదేశానికి తిరిగి పంపించేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారని’ గడ్కరీ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement