నగరంలోని నాలుగు మెట్రో స్టేషన్లను ఎందుకు మూసివేశారని రవాణాశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు. దీనిపై వివరణ కోరుతూ ఢిల్లీ మెట్రోరైల్
మెట్రో స్టేషన్లను ఎందుకు మూశారు?
Jan 21 2014 11:31 PM | Updated on Sep 2 2017 2:51 AM
న్యూఢిల్లీ: నగరంలోని నాలుగు మెట్రో స్టేషన్లను ఎందుకు మూసివేశారని రవాణాశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు. దీనిపై వివరణ కోరుతూ ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ)కి లేఖ రాశారు. మెట్రో స్టేషన్లను మూసివేసి ప్రజలను ఎందుకు ఇబ్బందులపాలు చేశారో తెలపాలని లేఖలో నిలదీశారు. విధులను నిర్లక్ష్యం చేసిన నలుగురు ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా సీఎం కేజ్రీవాల్ సోమవారం రైల్‌భవన్ ఎదుట ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. మద్దతుదారులు పెద్దఎత్తున తరలిరావాలంటూ ఆయన పిలుపునివ్వడంతో జనం తాకిడి కూడా పెరిగింది. దీంతో సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్‌భవన్, పటేల్‌చౌక్, రేస్‌కోర్సు స్టేషన్లను మూసివేశారు. దీంతో దాదాపు రెండు లక్షలమందికి పైగా ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. దీనికి కొందరు ఆమ్ ఆద్మీ పార్టీని, ఢిల్లీ సర్కాన్‌ను బాధ్యులను చేయడంతో మంత్రి స్పందించారు. ‘అవును మెట్రో స్టేషన్ల బంద్ విషయమై డీఎంఆర్‌సీకి లేఖ రాశం. మూసివేతకు కారణాలేమిటో మేము తెలుసుకోవాలనుకున్నామ’ని సౌరభ్ భరద్వాజ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
Advertisement
Advertisement