
సాక్షి, చెన్నై/బెంగళూరు : ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆయనకు సంఘీభావంగా ‘వాక్ విత్ జగనన్న’ (జగనన్నతో కలిసి నడుద్దాం) కార్యక్రమాన్ని చెన్నై, బెంగళూరు నగరాల్లోని వైఎస్‌ఆర్ అభిమానులు, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు భారీఎత్తున నిర్వహించారు.
జననేత పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగనన్నా ప్లకార్డులతో పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో మహిళలు, వైస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు భారీఎత్తున పాల్గొన్నారు.