
సంతానం టీమ్‌లు మెయిన్‌టైన్ చేస్తున్నాడు
నటుడు సంతానం ఏబీసీ అంటూ మూడు టీమ్‌లను మెయిన్‌టైన్ చేస్తున్నారని నటుడు ఆర్య అన్నారు.
నటుడు సంతానం ఏబీసీ అంటూ మూడు టీమ్‌లను మెయిన్‌టైన్ చేస్తున్నారని నటుడు ఆర్య అన్నారు. ఈయన నటిస్తున్న 25వ చిత్రం వాసువుమ్ శరవణనుమ్ ఒన్నా పడిచవంగా ఈ చిత్రానికి ఆర్యనే నిర్మాత కావడం విశేషం. రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతానం మరో ముఖ్య భూమికను పోషించారు. నటి తమన్న హీరోయిన్ డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం చెన్నైలో జరిగింది. అనంతరం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటుచేసింది. నటుడు, నిర్మాత ఆర్య మాట్లాడుతూ వాసువుమ్ శరవణనుమ్ ఒన్నా పడిచవంగా చిత్రం నటుడిగా తనకు 25వ చిత్రం అన్నారు. ఇప్పటి వరకు ఒక్కో చిత్రంలో ఒక్కో విషయాన్ని నేర్చుకున్నారన్నారు.
అంతేకాకుండా షో పీపుల్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించే స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందన్నారు. శివమనసుల శక్తి చిత్రంలో గెస్ట్ పాత్ర పోషించినప్పుడు ఆ చిత్ర దర్శకుడు రాజేష్‌తో పరిచయం అయ్యిందన్నారు. అలా మొదలైన స్నేహంతో బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రం చేశామని తెలిపారు. ఆ చిత్రం ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదన్నారు. ఆ తరువాత ఆయన దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఈ వాసువుమ్ శరవణనుమ్ ఒన్న పడిచవంగా చిత్రంలో తీరిందని పేర్కొన్నారు. నటుడు సంతానం నాకు ఎనీ టైమ్ ఫ్రెండ్ అన్నారు.
ఆయన ఏబీసీ అనే మూడు టీమ్‌లను మెయిన్‌టైన్ చేస్తున్నారని దీంతో మచ్చి (బావ) ఈ డైలాగ్ సరిగా లేదురా అని చెప్పగానే వెంటనే తన టీమ్‌కు ఫోన్ చేస్తాడు. ఐదు నిమిషాల్లోనే 15 పంచ్ డైలాగ్స్ స్పాట్‌కు వస్తాయని తెలిపారు. అదే విధంగా దర్శకుడు ఒక డైలాంగ్ పేపరు ఇస్తే సంతానం టీమ్ దాన్ని ఐదు విధాలుగా రాసి ఇస్తారని అన్నారు. బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రంలో సంతానంకు హీరోకు సమానమైన పాత్రలోనే ఈ చిత్రంలోనూ బలమైన పాత్ర అని తెలిపారు. ఆయన తనకు మెంటల్‌గానే కాదు ఫైనాన్సియర్‌గాను సపోర్టుగా నిలిచారని ఆర్య అన్నారు. దీంతో వాసువుమ్ శరవణమ్ ఒన్నాపడిచ్చవంగా చిత్రం విజయంపై నమ్మకం ఏర్పడిందని అన్నారు.