కల్వర్టును ఢీకొన్న బైక్‌, ఇద్దరి మృతి | Two killed in road accident | Sakshi
Sakshi News home page

కల్వర్టును ఢీకొన్న బైక్‌, ఇద్దరి మృతి

Oct 17 2016 7:19 AM | Updated on Sep 4 2017 5:30 PM

కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం ముల్లపాడు క్రాస్‌ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

కృష్ణా: కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం ముల్లపాడు క్రాస్‌ రోడ్డు వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న బైక్‌ ముల్లపాడు క్రాస్‌ రోడ్డు వద్ద కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు.  ముళ్లపాడుకు చెందిన కాళేశ్వరరావు(32), అవినాష్(22)గా గుర్తించారు.

గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, వారి బైక్ రోడ్డు పక్కన పడి ఉండగా మృతదేహాలు రెండు గుంతలో ఉన్నాయి. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement