breaking news
Bikist
-
కర్నూలు ఘటన.. మరో షాకింగ్ ట్విస్ట్!
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. బైక్.. బస్సునుగానీ, బస్సును.. బైక్ గానీ ఢీ కొట్టలేదని తెలుస్తోంది. అయితే బైక్ ప్రమాదానికి గురైన తర్వాతే.. బస్సు దానిని ఈడ్చుకెళ్లిందని, ఈ క్రమంలోనే ఘోర ప్రమాదం జరిగిందని తాజాగా పోలీసులు నిర్ధారించుకున్నట్లు సమాచారం. కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదానికి కారణంగా భావిస్తున్న బైక్‌పై శంకర్‌తో పాటు ఉన్న మరో యువకుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అతని నుంచి పోలీసులు సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి..శివశంకర్‌తోపాటు అతని స్నేహితుడు ఎర్రి స్వామి ఫుల్‌గా మద్యం సేవించి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక వర్షంలో వెళ్తుండగా.. చిన్నటేకూరు వద్ద బైక్ స్కిడ్ అయ్యి ఇద్దరూ పడిపోయారు. డివైడర్‌కు బలంగా తల ఢీ కొట్టడంతో శంకర్ బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎర్రిస్వామి.. రోడ్డు పక్కనే కూర్చుని పోయాడు. సరిగ్గా అదే సమయంలో.. రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్‌ను వీ కావేరీ ట్రావెల్స్ బస్సు ఈడ్చుకెళ్లింది. కాస్త దూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. అది చూసి భయపడిపోయిన శివశంకర్ స్నేహితుడు ఎర్రి సామి అక్కడి నుంచి పోరిపోయాడు. సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా అతన్ని పట్టుకున్న పోలీసులు.. అతని స్టేట్మెంట్ ఆధారంగా సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎర్రి స్వామిని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ఎర్రిస్వామిని రహస్యంగా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఎర్రిస్వామి ఇచ్చే స్టేట్మెంట్ కీలకంగా మారనుంది.ఇదీ చదవండి: కర్నూలు ఘటన.. ఎట్టకేలకు డ్రైవర్ అరెస్ట్ -
కల్వర్టును ఢీకొన్న బైక్, ఇద్దరి మృతి
కృష్ణా: కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం ముల్లపాడు క్రాస్ రోడ్డు వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న బైక్ ముల్లపాడు క్రాస్ రోడ్డు వద్ద కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. ముళ్లపాడుకు చెందిన కాళేశ్వరరావు(32), అవినాష్(22)గా గుర్తించారు. గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, వారి బైక్ రోడ్డు పక్కన పడి ఉండగా మృతదేహాలు రెండు గుంతలో ఉన్నాయి. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


