నాపరాళ్ల లారీ బోల్తా | stones larry upside down | Sakshi
Sakshi News home page

నాపరాళ్ల లారీ బోల్తా

May 5 2017 11:06 PM | Updated on Sep 5 2017 10:28 AM

నాపరాళ్ల లారీ బోల్తా

నాపరాళ్ల లారీ బోల్తా

బిణిగేరి గ్రామం సుంకులమ్మ ఆలయ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున ఓ లారీ బోల్తా పడింది.

- డ్రైవర్‌, క్లీనర్‌ను కాపాడిన పోలీసులు
 
ఆస్పరి: బిణిగేరి గ్రామం సుంకులమ్మ ఆలయ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున ఓ లారీ బోల్తా పడింది. అనంతపురం నుంచి పూణేకు నాపరాళ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ టైరు పంక్చర్‌ కావడంతో అదుపు తప్పి కల్వర్టులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దెబ్బతినగా.. అందులోని డ్రైవర్‌ పుల్లారెడ్డి, క్లీనర్‌ బాషా లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న ఆస్పరి ఎస్‌ఐ వెంకటరమణ వెంటనే ఆదోని అగ్నిమాపక సిబ్బందికి, 108కు సమాచారం ఇచ్చి ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు గంటలు పాటు  శ్రమించి అతి కష్టంపై డ్రైవర్, క్లీనర్‌ను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం 108లో ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తుల  ప్రాణాలను కాపాడిన ఎస్‌ఐ, అగ్నిమాపక సిబ్బంది. 108 సిబ్బందిని పలువురు అభినందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.       
 

Advertisement
 
Advertisement
Advertisement