‘వలయం’లో హాసికాదత్ | Three languages in valayam movie | Sakshi
Sakshi News home page

‘వలయం’లో హాసికాదత్

May 4 2015 12:50 AM | Updated on Sep 3 2017 1:21 AM

‘వలయం’లో హాసికాదత్

‘వలయం’లో హాసికాదత్

నటి హాసికాదత్‌కు అనేక అవకాశాలు వస్తున్నా చిత్రాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.

 టీనగర్: నటి హాసికాదత్‌కు అనేక అవకాశాలు వస్తున్నా చిత్రాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ‘ఒరు పందు నాలు రన్ ఒరు వికెట్’ చిత్రం ద్వారా తమిళ చిత్రరంగానికి కథానాయకిగా పరిచయమయ్యారు హాసికాదత్. మొదటి చిత్రంలోనే క్యారెక్టర్, కామెడీలతో పాటు  దెయ్యం పాత్రంలో నటించి తనకు అన్ని కథాపాత్రల్లో నటించే సత్తావుందని నిరూపించారు.
 
 ఈమె ప్రతిభను గమనించి అనేక చిత్రావకాశాలు తలుపు తడుతున్నా నచ్చిన కథ, కథాపాత్రలను ఆచితూచి ఎన్నుకుంటున్నారు. ఆ విధంగా ఆమె ఎంపిక చేసుకున్న కొత్త చిత్రం ‘వలయం’. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడం అనే మూడు భాషల్లో రూపొందుతోంది. జీవితంలో ప్రతి వ్యక్తిని సంఘర్షణకు గురిచేసే సమస్యలు అనేకం ఉంటాయి. ఇటువంటి సమస్యల వలయంలో చిక్కుకోకుండా సమస్యలను ఎదుర్కొని సాధించే వ్యక్తుల కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement