అదిరిందయ్యా.. సతీషూ.. | The decision on the change of the Ministry | Sakshi
Sakshi News home page

అదిరిందయ్యా.. సతీషూ..

Feb 27 2015 1:09 AM | Updated on Sep 2 2017 9:58 PM

సతీష్ జారకీ హోళీ మంత్రిత్వ శాఖను రాష్ట్ర ఎక్సైజ్ నుంచి చిన్నమధ్య తరహా పరిశ్రమల శాఖకు మారుస్తూ ముఖ్యమంత్రి ....

మంత్రిత్వ శాఖ మార్పుపై నిర్ణయం
ప్రతిపాదనను గవర్నర్‌కు పంపిన ముఖ్యమంత్రి

 
బెంగళూరు : సతీష్ జారకీ హోళీ మంత్రిత్వ శాఖను రాష్ట్ర ఎక్సైజ్ నుంచి చిన్నమధ్య తరహా పరిశ్రమల శాఖకు మారుస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను  గవర్నర్ వాజుభాయ్ రుడాభాయ్ వాలాకు గురువారం పంపించారు. ఇప్పటి వరకు సతీష్ జారకీహోళీ నిర్వహిస్తున్న ఎక్సైజ్ శాఖను ముఖ్యమంత్రి తన పర్యవేక్షణలోకి తీసుకున్నారు.

కాగా, ఎక్సైజ్ శాఖ తన మనస్తత్వానికి సరిపోదంటూ గతంలో సతీష్ జారకీహోళీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ రాజీనామాను వెనక్కు తీసుకునేందుకు గాను అప్పట్లోనే శాఖ మార్పుపై ఆయనకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం సతీష్ జారకీ హోళీకి రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖను కేటాయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement