దక్షిణ కాశీగా పిలుచుకునే శ్రీశైల క్షేత్రంలో మంగళవారంతో దసరా ఉత్సవాలు ముగిశాయి.
దక్షిణ కాశీగా పిలుచుకునే శ్రీశైల క్షేత్రంలో మంగళవారంతో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి. ఉదయం పూర్ణాహుతితో ఉత్సవాలను ముగిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శరన్నవరాత్రులు ముగియటంతో దసరా పర్వదినాన భ్రమరాంబికా దేవి భక్తులకు నిజాలంకరణతో దర్శనం ఇవ్వనుంది. సాయంత్రం శ్రీశైల మల్లన్న, భ్రమరాంబికా అమ్మవార్లు నంది వాహనం పై ఆలయ ప్రదక్షిణ చేస్తారు.