విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత | tension at vijayawada government hospital | Sakshi
Sakshi News home page

విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత

Mar 16 2017 4:25 PM | Updated on Sep 5 2017 6:16 AM

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు.

విజయవాడ: భవానీపురం హెచ్బీ కాలనీ వద్ద డ్రైనేజీలో పడి మృతిచెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించాయి. ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. కనీస సదుపాయాలు కల్పించకుండా పారిశుద్ధ్య కార్మికుల జీవితాలతో కార్పొరేషన్ అధికారులు చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తక్షణం పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement