రేపటి నుంచే వేసవి సెలవులు | Telangana schools summer vacation to begin from April 14 | Sakshi
Sakshi News home page

రేపటి నుంచే వేసవి సెలవులు

Apr 13 2017 1:34 PM | Updated on Sep 5 2017 8:41 AM

పాఠశాలలకు రేపటి నుంచి ( ఏప్రిల్‌ 14) వేసవి సెలవులు ప్రకటించారు.

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని పాఠశాలలకు రేపటి నుంచి ( ఏప్రిల్‌ 14) వేసవి సెలవులు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం మరోవారం స్కూల్స్‌ నిర్వహించాల్సి ఉన్నా.. మండుతున్న ఎండల కారణంగా వారం రోజుల ముందే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏప్రిల్ 15 (శనివారం) నుంచి షెడ్యూల్ ఉన్నా శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా.. ఓ రోజు ముందు నుంచే స్కూల్స్‌ బంద్ కానున్నాయి. వేసవి సెలవుల అనంతరం తిరిగి జూన్ 5వ తేదీ నుంచి తరగతుల వారీగా స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. కనీసంగా 45 రోజులుగా వేసవి సెలవులు ఇవ్వాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement