మోసం చేశాడు... పెళ్లి చేసుకున్నాడు | Tamilnadu Police done lovers marriage at Temple | Sakshi
Sakshi News home page

మోసం చేశాడు... పెళ్లి చేసుకున్నాడు

Aug 10 2014 9:52 AM | Updated on Sep 2 2017 11:41 AM

మోసం చేశాడు... పెళ్లి చేసుకున్నాడు

మోసం చేశాడు... పెళ్లి చేసుకున్నాడు

ఊత్తుకోటలో యువతిని మోసగించిన యువకుడు పోలీసులకు చిక్కగానే వివాహం జరిపించారు.

టీనగర్: ఊత్తుకోటలో యువతిని మోసగించిన యువకుడు పోలీసులకు చిక్కగానే వివాహం జరిపించారు. ఊత్తుకోట సమీపానగల కల్‌కాలవోడై గ్రామానికి చెందిన యువతి మణిమేగలై (21). శ్రీపెరంబుదూరులోగల ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంది. అదే గ్రామానికి చెందిన వెంకటేశన్ (28). టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. మణిమేగలై, వెంకటేశ్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మణిమేగలై సంపాదనతో తరచూ బయటి ప్రదేశాలకు వెళ్లి ఆమెతో చనువుగా గడిపేవాడు. 

తనను వివాహం చేసుకోవాలని మణిమేగలై ఒత్తిడి తెస్తూ వచ్చింది. ఏడాది తర్వాత చేసుకుందామని ఆమెతో చెప్పాడు. ఈ క్రమంలో వెంకటేశ్ అదృశ్యమయ్యాడు. తాను మోసపోయినట్లు తెలుసుకున్న మణిమేగలై ఊత్తుకోట మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంకటేశన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మణిమేగలైను వివాహం చేసుకోకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో అతను వివాహానికి ఒప్పుకున్నాడు. ఊత్తుకోట రవాణా సంస్థ వర్కుషాప్ సమీపంలోగల అమ్మవారి ఆలయంలో మణిమేగలైను వెంకటేశన్ వివాహం చేసుకున్నాడు. దీంతో మణిమేగలై తన ఫిర్యాదును వాపసు తీసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement