అమ్మే..కాదుకాదు తాతే | tamil nadu elections 2016 | Sakshi
Sakshi News home page

అమ్మే..కాదుకాదు తాతే

May 19 2016 2:57 AM | Updated on Sep 4 2017 12:23 AM

రాష్ట్ర ప్రజలు మరోసారి అమ్మకే ఓటు వేశారు, అమ్మ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని అన్నాడీఎంకే వాదన. ఇంకా అంత నమ్మకమా...

 సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్ర ప్రజలు మరోసారి అమ్మకే ఓటు వేశారు, అమ్మ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని అన్నాడీఎంకే వాదన. ఇంకా అంత నమ్మకమా...తాత (కరుణానిధి) ప్రభుత్వం ఖాయమని రెండు రోజుల క్రితమే తేలిపోయిందని డీఎంకే శ్రేణులు వాదించుకుంటున్నారు. ఎవరి ధీమా వారిదిగా నెలకొన్ని ఉన్న తరుణంలో గురువారం ఫలితాలు వెలువడనున్నాయి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార మార్పిడి ఖాయమనే సంప్రదాయాన్ని ఛేదిస్తామని అన్నాడీఎంకే గర్వంగా చెబుతోంది. అంతసీన్ లేదు, అధికారం మాదే, సందేహమైతే సర్వేలు చూడండి అంటూ డీఎంకే శ్రేణులు ధీమా వ్యక్తం చే స్తున్నారు.
 
 ఎన్నికలకు నెలరోజుల ముందు అనేక సర్వేలు అన్నాడీఎంకే ప్రభుత్వమని చెప్పగా, పోలింగ్ రోజున ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు డీఎంకేకు అనుకూలంగా మారాయి. అయితే ఒకటి మాత్రం నిజమని తేలిపోయింది. గత 50 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన డీఎంకే, అన్నాడీఎంకేలతో విసిగిపోయిన ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని ప్రజాసంక్షేమ కూటమి, పీఎంకేల వాదన నిజమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. అధికారంలోకి రాకున్నా తమిళ అసెంబ్లీ కాలుమోపడం ఖాయమని బీజేపీ గట్టి నమ్మకంతో ఉంది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో మద్యనిషేధం ప్రధాన నినాదంగా మారింది. అన్నాడీఎంకే దశలవారీగా మద్య నిషేధమని హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం మద్యనిషేధంపైనేనని డీఎంకే చెప్పింది. అంతేగాక ఇతర పార్టీలు సైతం టాస్మాక్‌కు వ్యతిరేకంగా వ్యవహరించాయి. మద్యనిషేధాన్ని కోరుకునే వారు ఇంతకూ ఎవరికి ఓటు వేశారనేది సస్పెన్స్‌గా మారింది.      
      
 ఫలితాలను శాసించనున్న కులపరమైన ఓట్లు:
 తమిళనాడు ప్రజలకు పోటీ పడి ఇచ్చిన వాగ్దానాలు, ఉచితాలతోపాటు కులపరమైన ఓట్లుకూడా ఫలితాలను శాసించనున్నాయి. లోని ఫలితాలను కులపరమైన ఓట్లు శాసించనున్నాయి. రాష్ట్రాన్ని ఐదుగా విభజిస్తే కొన్ని కులాల ప్రభావం అన్ని జిల్లాల్లో ఉండగా మరికొన్నికులపరమైన ఓట్లు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉన్నాయి. పశ్చిమం వైపున ఉన్న నామక్కల్, కృష్ణగిరి, ధర్మపురి, కోయంబత్తూరు, ఈరోడ్డు, తిరుపూరు, నీలగిరి జిల్లాల్లోని 57 సీట్లను గౌండర్లు, ముదలియార్లు, వన్నియర్లు అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకేలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
 
 అలాగే ఉత్తర తమిళనాడు ప్రాంతమైన తిరువళ్లూరు, చెన్నై, కాంచీపురం, వేలూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, కడలూరు జిల్లాల్లోని 78 సీట్ల గెలుపునకు వన్నియార్లు, దళితులు, మత్స్యకారులు, క్రైస్తవులు, ముస్లింలు డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, డీఎండీకే అండగా నిలుస్తున్నారు. అలాగే సెంట్రల్ తమిళనాడులో కరూరు, తిరుచ్చిరాపల్లి, పెరంబూరు, అరియలూరు, నాగపట్టణం, తిరువారూరు, తంజావూరు, పుదుక్కోట్టై చేనేతలు, మత్య్సకారులు, దేవర్లు, మూపనార్లు, ఉడయార్లు, బ్రాహ్మణులు డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్ పక్షాన నిలబడి 41 సీట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దక్షిణ తమిళనాడు ప్రాంతమైన దిండుగల్లు, శివగంగై, మధురై, తేనీ, విరుదునగర్, రామనాధపురం, తూత్తుకూడి, తిరునెల్వేలీ, కన్యాకుమారీ జిల్లాల్లో దేవర్లు, నాడార్లు, దళితులు, క్రైస్తవులు, ముస్లింలు, మత్స్యకారులు అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్, బీజేపీలలో మమేకమై 58 సీట్లను శాసించవచ్చని అంచనా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement