కాబోయే భర్త హత్యపై డెమో చూపించింది! | Sakshi
Sakshi News home page

కాబోయే భర్త హత్యపై డెమో చూపించింది!

Published Mon, Nov 9 2015 7:26 PM

కాబోయే భర్త హత్యపై డెమో చూపించింది! - Sakshi

చెన్నై: ప్రియుడితో కలిసి కాబోయే భర్తను హత్య చేసిన తీరును యువతి డెమో చూపించడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. తిరువళ్లూరు జిల్లా చిత్తుకాడు గ్రామంలోని ఇటుక బట్టీ వద్ద అనుమానాస్పద స్థితిలో ప్లాస్టిక్ డబ్బాలో తలవేరు చేసిన మృతదేహన్నీ పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసును ఛేదించడానికి ఎస్పీ శ్యామ్‌సన్ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. విచారణలో మృతి చెందిన వ్యక్తి చెన్నై పెరుంగుడి ప్రాంతానికి చెందిన హరికృష్ణన్ కుమారుడు రాజా(34)గా గుర్తించారు. ఇతను చెన్నైలోని యూటీఐ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి కొరట్టూరు ప్రాంతానికి చెందిన సత్యతో ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 15న వివాహం జరగాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో రాజా నాలుగో తేదీన ప్లాస్టిక్ డబ్బాలో శవమై కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. రాజా కాల్ డేటా ఆధారంగా ఆవడికి చెందిన సగాయం, సత్య తదితరులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో సత్య, సగాయంకు మధ్య పదేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. సత్య, సగాయం సంబంధానికి అడ్డువస్తాడనే కారణంతోనే రాజాను హత్య చేసిసినట్టు సగాయం వాగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు వివరించారు. ఈ విషయాన్ని సత్య పోలీసులకు డెమో ఇవ్వడం చర్చనీయాంశమైంది. రాజాపై దాడి చేసిన వ్యక్తుల్లో ఆవడికి చెందిన మదన్(29)ను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement