
'విభజన తర్వాత నేనెలాంటి భూములు కొనలేదు'
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో టీడీపీ నేతల భూ దందాపై కేంద్రమంత్రి సుజనా చౌదరి శుక్రవారం న్యూఢిల్లీలో స్పందించారు.
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధానిలో టీడీపీ నేతల భూ దందాపై కేంద్రమంత్రి సుజనా చౌదరి శుక్రవారం న్యూఢిల్లీలో స్పందించారు. ఈ భూ దందాపై విచారణ హాస్యాస్పదం అని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై విచారణ అవసరమా లేదా అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయిస్తారని అని చౌదరి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం నేనెలాంటి భూములు కొనలేదని బల్లగుద్ది మరీ సుజనా చౌదరి చెప్పారు. విమర్శల వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని సుజనా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.