శ్రీదివ్యపై దుష్ర్పచారం | Sakshi
Sakshi News home page

శ్రీదివ్యపై దుష్ర్పచారం

Published Thu, Apr 9 2015 2:55 AM

శ్రీదివ్యపై దుష్ర్పచారం

నటి  శ్రీ దివ్య అంటే గిట్టని వాళ్లు, ఆమె ఎదుగుదలను భరించలేనివారు ఆమెపై దుష్ర్పచారంతో దాడికి దిగుతారట. పదహారణాల తెలుగమ్మాయి శ్రీదివ్య. కోలీవుడ్‌లో మొదట విడుదలైన వరుత్త పడాద వాలిబర్ సంఘంతో విజయాన్ని అందిపుచ్చుకున్న ఈ భామ ఆ తరువాత జీవా, వెళ్లక్కార దురై వంటి చిత్రాలతో తన స్థాయిని పెంచుకుంటూ పలు అవకాశాలను దక్కించుకుంటూ వెళుతున్నారు. గ్లామర్ విషయంలో హద్దులు విధించుకుంటూ పక్కింటి అమ్మాయిగా పేరు తెచ్చుకుంటున్న శ్రీదివ్య నటుడు అధర్వతో జత కట్టిన ఈటి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో శ్రీ దివ్య కళాశాల విద్యార్థినిగా నటించారు.
 
 అదే విధంగా త్వరలో కార్తీతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. నటుడు శివకార్తికేయన్‌తో ఒక చిత్రంతో పాటు చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న శ్రీదివ్యపై కొందరు పని కట్టుకుని మరి దుష్ర్పచారం చేస్తున్నారట. చూడటానికి చిన్నమ్మాయిలా కనిపించినా శ్రీ దివ్య వయసు 28 ఏళ్లు అని, ఆ విధంగా చూస్తే యువ నటి కాదని, తమిళ హీరోల కంటే తెలుగు హీరోలతో డ్యూయెట్లు పాడటానికే ఆసక్తి చూపిస్తారని, అక్కడ అవకాశాలు వస్తే తమిళ చిత్ర పరిశ్రమ వైపే చూడరంటూ దుష్ర్పచారాలను చేస్తున్నారట. అయితే ఇవన్నీ ఈ చెవిలో విని ఆ చెవి ద్వారా వదిలేస్తున్నారట శ్రీదివ్య. పండ్లున్న చెట్టుకే రాళ్లన్న చందాన క్యాజువల్‌గా తీసుకుంటున్నారట.
 

Advertisement
 
Advertisement