ముగిసిన కృష్ణా పుష్కరాలు.. | special arrangements for krishna pushkaralu ending sessions in telugu states | Sakshi
Sakshi News home page

ముగిసిన కృష్ణా పుష్కరాలు..

Aug 23 2016 7:26 PM | Updated on Sep 4 2017 10:33 AM

ముగిసిన కృష్ణా పుష్కరాలు..

ముగిసిన కృష్ణా పుష్కరాలు..

సంగమం ఘాట్లో నిర్వహించిన మహా హారతి కార్యక్రమంతో కృష్ణా పుష్కరాలు ముగిశాయి.

విజయవాడ : విజయవాడలో 12 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన కృష్ణా పుష్కరాల ముగింపు వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. ఫెర్రి పవిత్ర సంగమం ఘాట్లో నిర్వహించిన మహా హారతి కార్యక్రమంతో కృష్ణమ్మకు ఘనంగా వీడ్కోలు పలికారు.
 
పవిత్ర సంగమం ఘాట్లో నిర్వహించిన మహా హారతి కార్యక్రమానికి పీవీ సింధు, కోచ్ గోపీచంద్తో పాటు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సురేశ్ ప్రభు, మంత్రులు హాజరయ్యారు. కేంద్ర మంత్రుల చేతుల మీదుగా  పీవీ సింధు, గోపీచంద్, కిదాంబి శ్రీకాంత్ లకు చంద్రబాబు చెక్కులను, జ్ఞాపికలను అందజేసి సత్కారించారు.

 సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో ముగింపు వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేక తెప్పించిన బాణాసంచా వెలుగులతో ముగింపు వేడుకలు కనులపండువగా జరిగాయి. హారతి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement