మూణే మూణు వారైలో బాలు | SP Balasubramaniam Captain Films Works Munu munu varai | Sakshi
Sakshi News home page

మూణే మూణు వారైలో బాలు

Dec 16 2014 1:54 AM | Updated on Sep 2 2017 6:13 PM

మూణే మూణు వారైలో బాలు

మూణే మూణు వారైలో బాలు

ప్రఖ్యాత గాయకుడు ఎస్‌పి బాలసుబ్రమణ్యం, సీనియర్ నటి లక్ష్మి ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం మూణే మూణు వారై.

ప్రఖ్యాత గాయకుడు ఎస్‌పి బాలసుబ్రమణ్యం, సీనియర్ నటి లక్ష్మి ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం మూణే మూణు వారై. కెప్టెన్ ఫిలింస్ వర్క్సు పతాకంపై యువ ప్రముఖ గాయకుడు, నిర్మాత ఎస్పీ చరణ్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇంతకుముందు చెన్నై-28, మలై, అరణ్యకాండం, కుంకుమ పువ్వుం కొంజుం పురావు, నాణయం, ఇటీవల విడదులైన తిరుడన్ పోలీసు వంటి విజయవంతమైన విభిన్న కథా చిత్రాలను నిర్మించిన కెప్టెన్ ఫిలింస్ వర్క్స్ నుంచి వస్తున్న తాజా చిత్రం మూణే మూణు వారై. వల్లమై తారయే, కొలకొలరు ముందిరిక వంటి విభిన్న కథా చిత్రాలను తెరపై ఆవిష్కరించిన మహిళా దర్శకురాలు మధుమిత దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం మూణే మూణు వార్తై
 
 చిత్రం గురించి నిర్మాత ఎస్‌పి చరణ్ తెలుపుతూ మంచి కథా చిత్రాలను నిర్మించాలన్నదే తన లక్ష్యం అన్నారు. చక్కని సంగీతాన్ని వింటూ పెరిగిన తాను అలాంటి చిత్రాలనే ప్రేక్షకులకు అందించి వారి ప్రశంసలు అందుకుంటున్నారన్నారు. ఖచ్చితంగా అలాంటి చిత్రమే మూణే మూణు వార్తైఅని చెప్పారు. తన చిత్రాలకు నూతన దర్శకులనే పరిచయం చేస్తున్నానని ఈ చిత్రం ద్వారా దర్శకురాలు మధుమితను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. మూణే మూణు వార్తైతమిళం, తెలుగు భాషలలో రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement