గురువారం స్కానింగ్‌లు బంద్ | sonography shutdown on Thursday | Sakshi
Sakshi News home page

గురువారం స్కానింగ్‌లు బంద్

Aug 30 2016 8:24 PM | Updated on Sep 4 2017 11:35 AM

గురువారం రాష్ట్రంలో స్కానింగ్‌లను నిలిపివేయనున్నట్లు డాక్టర్ వి.ఎన్.వరప్రసాద్ చెప్పారు.

భ్రూణహత్యలను నివారించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న పీసీ పీఎన్‌డీటీ యాక్ట్‌లో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని సవరించాలని కోరుతూ గురువారం రాష్ట్రంలో అన్ని రకాల స్కానింగ్‌లను నిలిపివేయనున్నట్లు ఇండియన్ రేడియాలజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వి.ఎన్.వరప్రసాద్ చెప్పారు. అత్యవసర స్కానింగ్‌లకు మినహాయింపు ఉంటుందన్నారు. సూర్యారావుపేట డోర్నకల్ రోడ్డులోని ఏబీసీ ఇమేజింగ్ సెంటర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ ఒకరోజూ పూర్తిగా స్కానింగ్‌లు నిలిపివేస్తామని, సెప్టెంబర్ 2 నుంచి 8 వరకూ గర్భిణీలను స్కానింగ్‌లు చేయబోమన్నారు. తమ సంఘ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా, అనంతర పరిణామాలపై తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. రేడియాలజిస్ట్‌లతో పాటు, గైనకాలజిస్ట్‌లు స్కానింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.


లోపాలివే..
తప్పు చేస్తే ఎవరికైన శిక్ష వేయవచ్చని, కానీ చిన్న లోపాలకు క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ మూడేళ్లు జైలు శిక్ష విధించడం సరికాదన్నారు. స్కానింగ్ చేసే రేడియాలజిస్ట్ తెల్లకోటు వేసుకోకపోయినా, నేమ్ బ్యాడ్జి ధరించకపోయినా, స్కానింగ్ సెంటర్‌లో లింగనిర్ధారణ చట్టవిరుద్ధమనే బోర్డు తనిఖీలకు వచ్చే సమయంలో కనిపించకపోయినా క్రిమినల్ కేసులు నమోదు చేసి మూడేళ్లు జైలు శిక్ష విధించడం సరైన పద్ధతి కాదన్నారు. ఫామ్ ఎఫ్ పూర్తి చేయడంతో కిందస్థాయి సిబ్బంది చేసిన పొరపాట్లకు రేడియాలజిస్ట్‌లను బాధ్యులను చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వీటన్నింటిని సవరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేవంలో అసిసోయేషన్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ టి.రాజేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మోహన్‌ప్రసాద్, డాక్టర్ కులదీప్ చలసాని, అబ్‌స్టేట్రిక్ అండ్ గైనకాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శశిబాల, డాక్టర్ శ్రీలతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement