మంత్రిగారా... మజాకా! | Sakshi
Sakshi News home page

మంత్రిగారా... మజాకా!

Published Fri, Jan 24 2014 11:54 PM

Somnath Bharti fails to appear before Delhi Women's Commission; flies kite at an event

 న్యూఢిల్లీ: అర్ధరాత్రి సమయంలో విదేశీ మహిళలతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతీ శుక్రవారం కూడా ఢిల్లీ మహిళా కమిషన్ ఎదుట హాజరుకాలేదు. తన న్యాయవాదిని ఢిల్లీ మహిళా కమిషన్‌కు పంపారు.

 కమిషన్ ముందు హాజరు కావాల్సిన సమయంలో ఆయన మాత్రం జల్సాగా గాలిపటాలు ఎగరేసుకుంటూ కనిపించడం, ఎందుకు హాజరు కాలేదని విలేకరులు అడిగినా నవ్వుతూ వెళ్లిపోవ డం వంటి చర్యలతో మరోమారు వార్తల్లోకెక్కారు.

 సంజాయిషీ వినడానికి ససేమిరా...
 మంత్రి స్వయంగా రాకుండా న్యాయవాదిని పంపడంతో ఆగ్రహించిన మహిళా కమిషన్ మంత్రి తరపున వచ్చిన న్యాయవాది సంజాయిషీ వినడానికి  నిరాకరించింది. దీనితో మహిళా కమిషన్ సభ్యులకు, న్యాయవాదికి మధ్య తీవ్రవాగ్వివాదం జరి గింది.  ఉగాండా మహిళల ఫిర్యాదుపై ఢిల్లీ మహిళల కమిషన్ సోమ్‌నాథ్ భారతీకి సమన్లు జారీ చేసి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలలోగా తన ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

 కానీ మహిళా కమిషన్ ఆదేశాల ప్రకారం సోమ్‌నాథ్ భారతీ స్వయంగా రాకుండా తన తరుఫున న్యాయవాదిని పంపారు. సోమ్‌నాథ్ భారతీ తరపున ఆయన న్యాయవాది ఇచ్చే సంజాయిషీ వినడానికి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బర్ఖాసింగ్ నిరాకరించారు. సోమ్‌నాథ్ భారతీ సంతకం చేసిన ఆథరైజేషన్ లెటర్ చూసిన తరువాతే అతని సంజాయిషీ వింటానని చెప్పారు.

సోమ్‌నాథ్ భారతీకి తప్పు చిరునామాకు సమన్లు పంపారని, సకాలంలో సమసన్లు అందనందువల్ల ఆయన స్వయంగారాలేకపోయారని అందువల్ల ఆయన  శుక్రవారం రాలేకపోయారని, సోమవారం హాజరువుతారని  సోమ్‌నాథ్ తరపున వచ్చి న న్యాయవాది రిషికేష్ కుమార్  చెప్పారు. దీనిపై కాసేపు వాగ్వావాదం జరిగింది.
 
 బర్ఖాసింగ్ గుస్సా..
 రెండోసారి సమన్లు జారీ చేసిన తరువాత కూడా సోమ్‌నాథ్ భారతీ రాకపోవడం ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఆగ్రహం తెప్పించింది. సోమ్‌నాథ్ భారతి ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయ్యారని బర్ఖాసింగ్ అభిప్రాయపడ్డారు. ఇది  ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన  సంస్థను అవమానించడమేనని బర్ఖాసింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

 మంత్రి సోమ్‌నాథ్ భారతి కొంతమందితో వచ్చి అర్ధరాత్రి సమయంలో  తమతో అనుచితంగా ప్రవర్తించారని ఉగాండా మహిళలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదుచేశారు. దీనిపై మహి ళా కమిషన్ సోమ్‌నాథ్ భారతీకి సమన్లు జారీ చేసి మంగళవారం తన ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కానీ ఆసమయంలో ధర్నాలో ఉన్న సోమ్‌నాథ్ భారతీ మహిళా కమిషన్ ఎదుట హాజ రుకాలేదు. తనకు సమన్లు అందలేదని ఆయన చెప్పారు. దీంతో మహిళా కమిషన్ మరోమారు ఆయనకు సమన్లు జారీ చేసి శుక్రవారం తన ముందుండాలని పేర్కొంది.

 ఈ సారి కూడా హాజరుకానట్లయితే లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని మహిళా కమిషన్ ముందుగానే హెచ్చరించింది. అయినప్పటికీ మంత్రి హాజరు కాలేదు. కాగా దీనిపై బర్ఖాసింగ్ తదుపురి ఎలా స్పందిస్తారో చూడాలి..!

Advertisement
Advertisement