శ్రుతి పెద్ద మనసు | Shruti Haasan helps Jammu and Kashmir flood victims | Sakshi
Sakshi News home page

శ్రుతి పెద్ద మనసు

Sep 24 2014 12:12 AM | Updated on Jul 25 2019 5:24 PM

శ్రుతి పెద్ద మనసు - Sakshi

శ్రుతి పెద్ద మనసు

పక్కవాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు చేతనైన సాయం చేసి ఆదుకోవడం మానవత్వం. అలాంటి సాయపడేగుణం తనకుందని నిరూపించుకున్నారు శ్రుతిహాసన్. ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో

పక్కవాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు చేతనైన సాయం చేసి ఆదుకోవడం మానవత్వం. అలాంటి సాయపడేగుణం తనకుందని నిరూపించుకున్నారు శ్రుతిహాసన్. ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తొలుత తెలుగు, హిందీ, తమిళం భాషల్లో అంతగా లక్ ఉన్న నటి అనిపించుకోకపోయినా ఇప్పుడామె సూపర్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. పాత్రలకు న్యాయం చేయడానికి అందాలారబోతలో హద్దులు మీరడానికైనా వెనుకాడని ధారాళ మనసు శృతి హాసన్‌దేనన్న పేరుంది.
 
 ఇతరుల కష్టాలకు కరిగిపోయే మనసామెది. ఇందుకు సాక్ష్యం ఇటీవల ఆమె కాశ్మీర్ వరద బాధితుల నివారణకు అందించిన పెద్ద మొత్తంలో విరాళమే. సమీప కాలంలో కాశ్మీర్‌ను వరదలు ముంచెత్తి ప్రాణనష్టంతోపాటు భారీ ఆస్తి నష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే. దీంతో దేశ ప్రధాని వరద బాధితులకు చేయూత నివ్వండంటూ ప్రకటించారు. బాలీవుడ్ నటులు సల్మాన్‌ఖాన్, అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్, కునాల్ కపూర్, సోనాక్షి సిన్హా వంటి వారు కొంత మొత్తాన్ని అందించారు.
 
 అలాంటి వారి పట్టికలో మన శ్రుతిహాసన్ కూడా ఉండటం విశేషం. ఈమె కాశ్మీర్ వరద బాధితుల సహాయార్థం భారీ మొత్తాన్ని ప్రధానమంత్రి నిధికి అందించారు. అంతేకాదు యువతీ యువకులు, సేవా సంఘాలు వరద బాధితులకు విరివిగా విరాళాలు అందించి ఆదుకోవాలని పిలుపు నిచ్చారు. అందమైన మనసు గల నటి శ్రుతిహాసన్ అని నిరూపించారు. దీని గురించి శ్రుతి మాట్లాడుతూ మనిషికి అందం మాత్రం ఉంటే చాలదు. తెలివి కూడా ఉండాలన్నారు. తెలివిలేని వారికి అందం నిరుపయోగం అన్నారు. అందం ఇతరులను ఆకర్షించవచ్చు. అయితే జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి తెలివితేటలు చాలా అవసరం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement