నగరవాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకొనే గణేశ్ చతుర్థికి పటిష్ట భద్రత కల్పించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని పోలీసుశాఖ ప్రకటించింది. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా చూసేందుకు తగిన న్ని పోలీసు బలగాలను హోంశాఖ రంగంలోకి దిం పింది.
సాక్షి, ముంబై: నగరవాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకొనే గణేశ్ చతుర్థికి పటిష్ట భద్రత కల్పించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని పోలీసుశాఖ ప్రకటించింది. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా చూసేందుకు తగిన న్ని పోలీసు బలగాలను హోంశాఖ రంగంలోకి దిం పింది. ముంబైవ్యాప్తంగా దాదాపు ఆరువేల సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు ఉన్నాయని అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) సదానంద్ దాతే పేర్కొన్నారు. లక్ష మందికిపైగా ప్రజలు ఇళ్లలోనే విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నట్టు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. వీటన్నింటికోసం 114 చోట్ల నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసినట్లు దాతే చెప్పారు. ప్రజలు వదంతులను నమ్మకూడదని, అత్యవసరమైతే 22633333 నంబరును సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. నిమజ్జనం సమయంలో ఇబ్బందులు తలెత్తగల 200 సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించారు.
భద్రత కోసం 25 వేల మంది పోలీసులతోపాటు, బీఎస్‌ఎఫ్, ఎస్ ఆర్పీఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్‌ఏఎఫ్‌కు చెందిన 18 బెటాలియన్లు, 450 బీట్ మార్షల్స్‌ను మోహరించా రు. వీరితోపాటు నగరం బయట నుంచి వచ్చిన 100 మంది పోలీసు అధికారులు, 2,800 మంది సిబ్బంది, 2,500 మంది హోంగార్డులు, సివిల్ డిఫెన్స్‌కు చెందిన 500 మంది కార్యకర్తలు అందుబాటు లో ఉంటారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు 3,344 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తారు. ఫోర్స్ వన్, ఏటీఎస్ అధికారులు కూడా భద్రతపై దృష్టిసారిస్తారు. అత్యవసర సమయంలో కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌చేస్తే 5-7 నిమిషాల్లోనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుంటారన్నారు.