‘ఆ’ సన్నివేశాల్లో ఉన్నది నేను కాదు | Sakshi
Sakshi News home page

‘ఆ’ సన్నివేశాల్లో ఉన్నది నేను కాదు

Published Sat, Apr 19 2014 8:19 AM

‘ఆ’ సన్నివేశాల్లో ఉన్నది నేను కాదు

 అగ్రజ యూనిట్‌పై నటి సంజన మండిపాటు
 
సాక్షి, బెంగళూరు : ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు జగ్గేష్ నటించిన అగ్రజ సినిమా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది. అయితే విడుదలైన రోజునే సినిమా వివాదం సృష్టించింది. అగ్రజ సినిమాలోని కొన్ని అశ్లీల సన్నివేశాల్లో ఉన్నది తానే అన్నట్లుగా చిత్ర యూనిట్ చూపించిందని, అయితే ఆ సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని హీరోయిన్‌గా కనిపించిన సంజన పేర్కొన్నారు. 

వేరొకరితో ఆ సన్నివేశాలు చిత్రీకరించి, అందులో ఉన్నది తానేనన్నట్లుగా చూపించడం ఎంతగానో బాధించిందంటూ తన ట్విట్టర్ అకౌంట్‌లో సంజన పేర్కొన్నారు. ఇక సంజన ఆరోపణలపై అగ్రజ సినిమా దర్శకుడు శ్రీనందన్ స్పందిస్తూ...‘చిత్రకథ, ఇందులో సంజనపై చిత్రించనున్న దృశ్యాలు తదితర అన్ని వివరాలు చెప్పే చిత్రీకరించాం. ఇందులో మేం ఎలాంటి మోసానికి పాల్పడలేదు’ అని పేర్కొన్నారు.
 

 
Advertisement
 
Advertisement