ఎక్కడైనా మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తే సంబంధిత వ్యక్తులపై ఎక్సైజ్ శాఖశ్రీ చర్యలు తీసుకుంటుంది.
కట్టుబాట్లు విధించుకున్న హరపనహళ్లి, అలగిలవాడ గ్రామస్తులు
హరపనహళ్లి (దావణగెరె) : ఎక్కడైనా మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తే సంబంధిత వ్యక్తులపై ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంటుంది. అయితే ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండా మద్యం అక్రమార్కులకు కొన్ని గ్రామాల్లో రూ.లక్ష జరిమానా విధిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...దావణగెరె జిల్లా, చిరస్థహళ్లి గ్రామ పంచాయతీలోని హరపనహళ్లి, అలగిలవాడ గ్రామాల్లోని ప్రజలు మద్యం విక్రయాలపై స్వచ్ఛందంగా నిషేధం విధించుకున్నారు. ఆయా గ్రామల్లో ఎవరైనా మద్యం అమ్మితే రూ.లక్ష దండన విధిస్తామని ప్రకటించారు.
అంతేకాకుండా తమ హెచ్చరికలను ఖాతరు చేసి మద్యం విక్రయించిన వారి గురించి సమాచారమిచ్చిన వారికి రూ.25,000 బహుమతి ప్రకటించడం మరో విశేషం. మద్యం అమ్మకాల వల్ల తమ గ్రామాల్లో శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందని, వయసు తేడా లే కుండా పిల్లలు, పెద్దలు మద్యానికి బానిసలయ్యారని, అందుకే మద్యం అమ్ముతున్న దుకాణాలను మూసివేయించి ఇకపై మద్యం అమ్మిన వారికి రూ.లక్ష దండన విధించేలా నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు తెలిపారు.