కొత్త కులాలను చేరిస్తే రిజర్వేషన్ శాతాన్నీ పెంచండి | reservation percentage should be increased in case added new Community | Sakshi
Sakshi News home page

కొత్త కులాలను చేరిస్తే రిజర్వేషన్ శాతాన్నీ పెంచండి

Nov 28 2014 12:39 AM | Updated on Sep 15 2018 3:07 PM

ఎస్టీ జాబితాలో కొత్త కులాలను చేర్చాల్సి వస్తే, అందుకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌రావు డిమాండ్ చేశారు.

వైఎస్సార్ సీపీ ఎంపీ వరప్రసాద్‌రావు

సాక్షి, న్యూఢిల్లీ: ఎస్టీ జాబితాలో కొత్త కులాలను చేర్చాల్సి వస్తే, అందుకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌రావు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సవరణ బిల్లుపై చర్చలో భాగంగా ఆయన గురువారం లోక్‌సభలో ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సవరణ బిల్లుకు తమ పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకలించారు. కేంద్ర ప్రభుత్వం కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లోని కొన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయన్నారు.

అయితే ఇప్పటికే ఉన్న ఎస్టీలకు నష్టం జరగకుండా ఆ ప్రక్రియ చేపట్టాలని కోరారు. దేశంలో నమోదవుతున్న ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో కేవలం 10 శాతం వాటిల్లోనే శిక్షలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2012లో 3.048 కేసులు నమోదైతే కేవలం 175 కేసుల్లోనే శిక్షలు పడ్డాయని గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement